Suriya - Boyapati Srinu Movie: నోరు తెరిచి అడిగిన బోయపాటి శ్రీను, సూర్య మనసులో ఏముందో?
సూర్య శివకుమార్, బోయపాటి శ్రీను కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా? లేదా?
![Suriya - Boyapati Srinu Movie: నోరు తెరిచి అడిగిన బోయపాటి శ్రీను, సూర్య మనసులో ఏముందో? Suriya - Boyapati Srinu Movie: Tollywood director Boyapati Srinu expressed his wish to work with kollywood star Suriya Sivakumar Suriya - Boyapati Srinu Movie: నోరు తెరిచి అడిగిన బోయపాటి శ్రీను, సూర్య మనసులో ఏముందో?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/05/80bced285414345a5797e11fb5f73b03_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కథలు కుదిరితే అగ్ర దర్శకులతో సినిమాలు చేయడానికి హీరోలు రెడీగా ఉంటారు. దర్శకుల శైలి ఏంటో హీరోలకూ తెలుసు కనుక సినిమాలు సెట్ కావడానికి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. సభాముఖంగా సినిమా అవకాశాలు అడగటం వంటివి ఉండవు. రెమ్యూనరేషన్స్, డేట్స్ అడ్జస్ట్ కావడం వంటివి మాత్రమే ఉంటాయి. అయితే... తమిళ హీరో సూర్యతో సినిమా చేయాలని ఉందని దర్శకుడు బోయపాటి శ్రీను సభాముఖంగా చెప్పారు. మరి, సూర్య ఏమంటారో? ఆయన మనసులో ఏముందో?
సూర్య కథానాయకుడిగా నటించిన 'ఇటి' (ఎవరికీ తలవంచడు) సినిమా మార్చి 10న విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బోయపాటి శ్రీను అతిథిగా హాజరయ్యారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ సినిమా కోసం ఆడియన్స్ గోల గోల చేశారు. అప్పుడు బోయపాటి శ్రీను "వాళ్ళు అడిగారని కాదు సార్! బేసిగ్గా నేనొక మంచి దర్శకుడిని. మాస్ డైరెక్టర్ ని. నా టైమ్ కుదిరినప్పుడు, మీ టైమ్ కుదిరినప్పుడు తప్పకుండా మనం కలిసి సినిమా చేద్దాం సార్! ఈ వేదికగా చెబుతున్నాను" అని మాట్లాడారు.
Also Read: రానాకు క్లాస్ పీకిన సూర్య
సూర్యతో సినిమా చేయాలని బోయపాటి శ్రీనుకు ఉంది. గతంలో ఒకసారి ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అప్పుడు కలిశారో? లేదో? ఈసారి నోరు తెరిచి మరీ మీతో సినిమా చేయాలని ఉందని వేదికపై సూర్యను అడిగారు. ఆయన మనసులో ఏముందో మరి? ఒకవైపు 'జై భీమ్', 'ఆకాశమే నీ హద్దురా' వంటి డిఫరెంట్ సినిమాలు చేయడంతో పాటు 'సింగం' వంటి కమర్షియల్ సినిమాలు కూడా సూర్య చేస్తుంటారు. బోయపాటి శ్రీను వంటి మాస్ డైరెక్టర్, సూర్య కాంబినేషన్ కుదిరితే బావుంటుందని కొంత మంది కోరిక.
Also Read: సూర్యను కలిసిన 'సూర్య' - తన కలను నెరవేర్చుకున్న షణ్ముఖ్ జస్వంత్, ఆనందానికి అవుధులే లేవు!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)