Rajinikanth : తలైవా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్? - కమల్‌తో మల్టీ స్టారర్ ఓకే... సినిమాలకు రిటైర్మెంట్ అప్పుడేనా?
Rajinikanth Kamal Haasan : సూపర్ స్టార్ రజినీ కాంత్ రిటైర్మెంట్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై ఆయన ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

Latest Shocking Buzz Gone Viral On Rajinikanth Retirement : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా... ఆ తర్వాత ఆయన రిటైర్ కాబోతున్నారనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అటు కోలీవుడ్, ఇటు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
కమల్‌తో మల్టీ స్టారర్ తర్వాత...
యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో తలైవా మూవీ ఉండబోతుంది అని కన్ఫర్మ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, ఈ మూవీ తర్వాత తలైవా రిటైర్ కాబోతున్నారు అనే వార్తతో అంతా షాక్ అవుతున్నారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇద్దరు స్టార్ హీరోస్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా శాసించారో ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : యంగ్ హీరోతో రవితేజ మల్టీస్టారర్ - క్రేజీ కాంబో వేరే లెవల్... మాస్ కామెడీ మామూలుగా ఉండదంతే...
'జైలర్ 2'తో బిజీ
ప్రస్తుతం తలైవా 'జైలర్ 2'తో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... వచ్చే ఏడాది జూన్ 12 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాతే కమల్‌తో మల్టీ స్టారర్ ట్రాక్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మూవీకి కూడా రజినీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
వీటి తర్వాత సుందర్ సి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారట. ఆ తర్వాత రజినీ కాంత్ సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, సుందర్ సి మూవీ తర్వాత కమల్‌తో మల్టీ స్టారర్ చేయబోతున్నారా? లేక ముందే చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రజినీ రిటైర్మెంట్ వార్తపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ రెండు మూవీస్ తర్వాత రజినీ రిటైర్ అవుతారా? అంటూ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.






















