అన్వేషించండి

Border 2 Release: నేను ధర్మేంద్ర కొడుకును... 'బోర్డర్ 2'లో సన్నీ డియోల్ నివాళికి ఫ్యాన్స్‌ ఫిదా

Sunny Deol Border 2 News: సన్నీ డియోల్ హీరోగా నటించిన 'బోర్డర్ 2' ఇవాళ విడుదలైంది. సినిమా కంటే ముందు టైటిల్ కార్డులో దివంగత తండ్రి ధర్మేంద్రకు నివాళులు అర్పించి అభిమానుల మనసు గెలుచుకున్నారు సన్నీ.

సన్నీ డియోల్ హీరోగా నటించిన 'బోర్డర్ 2' సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సంవత్సరం బాలీవుడ్ మొదటి బ్లాక్ బస్టర్ అంటున్నారు. సన్నీ డియోల్ నటనకు ఫ్యాన్స్, ఆడియన్స్ మరోసారి ఫిదా అయ్యారు. సినిమా సంగతి పక్కన పెడితే... దివంగత కథానాయకుడు, తన తండ్రి ధర్మేంద్రకు 'బోర్డర్ 2'లో సన్నీ డియోల్ నివాళులు అర్పించారు. ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

నేను ధర్మేంద్ర కొడుకును... 'బోర్డర్ 2' టైటిల్ కార్డు!
Border 2 Latest News: 'బోర్డర్ 2' ఓపెనింగ్ సీన్ చూడటానికి థియేటర్లకు వెళ్ళిన ప్రజలు... దివంగత బాలీవుడ్ లెజెండ్, సన్నీ డియోల్ తండ్రి ధర్మేంద్ర (Dharmendra)కు హృదయపూర్వక నివాళులు అర్పించడంతో ఆశ్చర్యపోయారు. టైటిల్ క్రెడిట్స్‌లో తనను తాను 'ధర్మేంద్ర కా బేఠా' (ధర్మేంద్ర జీ కొడుకును) అని సన్నీ డియోల్ పేర్కొన్నారు. అది చూసి చాలా మంది అభిమానులు సంతోషించారు.

Also Read:Happy Raj Telugu Release: తెలుగులోనూ అబ్బాస్ రీ ఎంట్రీ సినిమా రిలీజ్... జీవీ -గౌరీల పెళ్లి గొడవ చూశారా?

ధర్మేంద్ర ప్రేరణతో 'బోర్డర్'... డియోల్ ఎమోషనల్
గత ఏడాది నవంబర్‌లో... 90వ పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందు ధర్మేంద్ర మరణించారు. తన తండ్రి మరణం తరువాత 'బోర్డర్' ఫ్రాంచైజీ (సినిమాల)తో తనకు ఉన్న లోతైన భావోద్వేగ సంబంధం గురించి సన్నీ డియోల్ మాట్లాడారు. ధర్మేంద్ర తనను సీక్వెల్ కోసం ఎలా ప్రేరేపించారో వివరించారు.

'హకీకత్' సినిమా గురించి సన్నీ డియోల్ మాట్లాడుతూ... "నేను 'బోర్డర్' ఎంచుకున్నాను. ఎందుకంటే... నేను మా నాన్నగారి 'హకీకత్' చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. నేను నటుడిగా మారినప్పుడు నా తండ్రి సినిమా లాంటి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను" అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "నేను జె.పి. దత్తాతో మాట్లాడాను. లోంగేవాలా సబ్జెక్ట్‌పై ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా" అని అన్నారు.

Also ReadSharwanand: నిర్మాత అనిల్ సుంకరకు శర్వానంద్ ప్రామిస్... ఇది బంపర్ ఆఫర్ అంటే!  

యువతపై సన్నీ డియోల్ 'బోర్డర్' ప్రభావం
'బోర్డర్' సినిమా ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా యువతకు ఎలా నచ్చిందో... వాళ్ళపై ఎటువంటి ప్రభావం చూపిందో కూడా సన్నీ డియోల్ చెప్పారు. తన సినిమా ప్రజలను సాయుధ దళాలలో చేరడానికి ప్రేరేపిస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇంకా సన్నీ డియోల్ మాట్లాడుతూ "ఇంత మంది యువకులకు సాయుధ దళాలలో చేరడానికి ధైర్యం ఇస్తామని నాకు తెలియదు. నేను వారిని కలిసినప్పుడల్లా నా సినిమా చూసిన తర్వాత వారు ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నారని చెబుతారు. నేను ఎక్కడికి వెళ్లినా ఈ మాటలు వినబడతాయి" అని అన్నారు.

Also ReadCheekatilo Review Telugu - 'చీకటిలో' రివ్యూ: Prime Videoలో క్రైమ్ థ్రిల్లర్ - శోభితా ధూళిపాళ నటించిన మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన 'బోర్డర్ 2' బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే మంచి ప్రారంభాన్ని అందుకుంది. కేవలం మార్నింగ్ షోల ద్వారా దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సన్నీ డియోల్ 'గదర్ 2' మొదటి రోజున 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ రికార్డును ఈ చిత్రం బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget