అన్వేషించండి

Cheekatilo Review Telugu - 'చీకటిలో' రివ్యూ: Prime Videoలో క్రైమ్ థ్రిల్లర్ - శోభితా ధూళిపాళ నటించిన మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

OTT Review - Cheekatilo Movie Streaming On Prime Video: శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'. ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

Prime Original Movie Cheekatilo Review In Telugu: శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'. విశ్వదేవ్ రాచకొండ, శ్రీనివాస్ వడ్లమాని, అదితి మ్యాకల్, ఆమని, చైతన్య కృష్ణ, ఈషా చావ్లా ఇతర ముఖ్య తారాగణం. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో జనవరి 23 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

కథ (Cheekatilo Movie Story): సంధ్య నెల్లూరి (శోభితా ధూళిపాళ) ఓ న్యూస్ ఛానల్‌లో ప్రజెంటర్. నేరాలు - ఘోరాలు తరహా కాన్సెప్ట్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అవుతుంది. అయితే టీఆర్పీ ఛానల్ చేసే పనులు నచ్చక ఉద్యోగం మానేస్తుంది. రెండేళ్ళ నుంచి ఆ ఛానల్‌లో ఇంటర్న్‌గా పని చేసే బాబీ (అదితి మ్యాకల్) ఇచ్చిన ఐడియాతో పాడ్ కాస్ట్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది.

అనూహ్యంగా బాబీ హత్యకు గురి అవుతుంది. హంతకుడు ఎవరో తెలుసుకోవాలని సంధ్య చేసిన ప్రయత్నాల్లో సీరియల్ కిల్లర్ చేసిన పని అని అర్థం అవుతుంది. ఈ వివరాలు చెబుతూ సంధ్య చేసే పాడ్ కాస్ట్ ప్రజల్లో, పోలీసుల్లో చర్చకు దారి తీస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతడిని ఎవరు, ఎలా పట్టుకున్నారు? ఈ ప్రయాణంలో సంధ్యకు కాబోయే భర్త అమర్ (విశ్వదేవ్ రాచకొండ), పోలీస్ అధికారులు రాజీవ్ (చైతన్య కృష్ణ), ఆనందిత (ఈషా చావ్లా) ఏం చేశారు?

విశ్లేషణ (Cheekatilo Review Telugu): సీరియల్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వచ్చిన సినిమాలు కోకొల్లలు. అయితే చాలా సినిమాల్లో హంతకుడు వరుస హత్యలు చేయడానికి గల కారణాలు అప్పటికే పలు సినిమాల్లో చూసినట్టు లేదా రొటీన్‌గా ఉన్నట్టు అనిపిస్తాయి. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'చీకటిలో' సీరియల్ కిల్లర్ మోటివ్ డిఫరెంట్‌గా ఉంది. ఇన్నాళ్ళూ లైంగిక వేధింపులను ఒక కోణంలో చూపించారు. ఇందులో మరో కోణం తీసుకున్నారు. సినిమాకు అది డిఫరెంట్ టచ్.

'చీకటిలో' పాయింట్ కొత్తగా ఉంది. ఎండింగ్ ఎక్స్‌పెక్ట్‌ చేయని విధంగా, ప్రతి ఒక్కరి ఊహలకు అతీతంగా వెళ్ళింది. చివరి వరకు హంతకుడు ఎవరు? అనేది ఊహించడం కష్టం. మంచి ఎండింగ్ రాసుకున్న దర్శక రచయితలు రొటీన్‌గా ఈ సినిమాను స్టార్ట్ చేయడం మైనస్ పాయింట్. శోభితా ధూళిపాళ పాత్రను, వరుస హత్యలను పరిచయం చేసిన తీరు ఎటువంటి ఉత్కంఠకు గురి చేయదు. ఏ విధమైన ఆసక్తి కలిగించదు. సింపుల్ & స్ట్రైయిట్‌గా వెళుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అసలు ఏమాత్రం ఆసక్తి కలిగించలేదు. మొదటి గంట తర్వాత సినిమాలో అసలైన ఆసక్తి మొదలైంది. చివరి అరగంట ఎంగేజ్ చేసింది.

ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీల్లో వీక్షకులను ఎంగేజ్ చేయడం కోసం కొన్ని క్యారెక్టర్స్ మీద అనుమానాలు క్రియేట్ అయ్యేలా చేయడం సహజం. వెరీ రొటీన్. 'చీకటిలో' దర్శక రచయితలు సైతం మధ్యలో అటువంటి జిమ్మిక్కులు చేశారు. అయితే ఎండింగ్ ట్విస్ట్ డిఫరెన్స్ తీసుకొచ్చింది. మహిళలపై లైంగిక దాడి, హత్యాచారాలు ఉన్నప్పటికీ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి వల్గారిటీగా చూపించలేదు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల పూర్తిగా న్యాయం చేశారు. పాట, నేపథ్య సంగీతం... ఏదైనా కథతో పాటు ప్రయాణించింది. కథలో వీక్షకులను లీనం చేసేలా సాగింది. సినిమాటోగ్రఫీ సైతం బావుంది. కథకు తగ్గట్టు డార్క్ టోన్ మైంటైన్ చేశారు.

మీడియాలో పని చేసే మహిళలు, మోడ్రన్ & ఇండిపెండెంట్ అమ్మాయిలు అంటే జీన్స్ లేదా వెస్ట్రన్ వేర్‌లో చూపించడం కామన్. ఈ నేపథ్యంలో చుడిదార్ ధరించే అమ్మాయిలు, చీరలు కట్టుకునే మహిళలు సైతం స్ట్రాంగ్ & ఇండిపెండెంట్‌గా ఉంటారని చూపించాలనే ఆలోచన ఎవరిదో గానీ మెచ్చుకోవాలి. జీన్స్ టీ షర్టులు ధరించడం తప్పని కాదు... ఆ అవకాశం ఉన్నప్పటికీ, సినిమా అంతటా శోభితా ధూళిపాళ చుడిదార్ లేదా చీరల్లో కనిపించారు. ఈ సినిమాకు అది తెలుగు నేటివ్ లుక్ తీసుకొచ్చింది.

Also Readఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్

'చీకటిలో'కు శోభితా ధూళిపాళ నటన, ముఖ్యంగా డబ్బింగ్ బలంగా నిలిచాయి. ఈ సినిమాకు ముందు 'గూఢచారి', 'మేజర్'లో ఆమె కనిపించారు. అయితే... తెలుగులో కథానాయికగా నటించిన మొదటి సినిమా ఇదేనని చెప్పాలి. నటిగా శోభిత ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. 'చీకటిలో' పాత్రకు తగ్గట్టు సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. ఆయా సన్నివేశాల్లో గాఢత తెలిపేలా ఆమె ఓన్ డబ్బింగ్ సాగింది. శోభిత వాయిస్ బావుంది. అచ్చ తెలుగమ్మాయి లుక్‌ కూడా! విశ్వదేవ్ రాచకొండ, ఈషా చావ్లా, ఆమని, సురేష్ పాత్రలు పరిమితమే. రవీంద్ర విజయ్ నటనను పూర్తిగా వాడుకోలేదు. శ్రీనివాస్ వడ్లమాని అదరగొట్టారు. అంతకు మించి చెప్పలేం.

క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీలు చూసే వీక్షకులకు 'చీకటిలో' సినిమా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. రెగ్యులర్‌గా మొదలైనప్పటికీ... సినిమాలోకి వెళ్లే కొలదీ ఆసక్తి కలిగిస్తుంది. చివరి అరగంట ఎంగేజ్ చేస్తుంది. శోభిత - అక్కినేని ఫ్యాన్స్ అంచనాలు తక్కువ పెట్టుకోవడం మంచిది. హిందీలో వెబ్ సిరీస్‌లతో హిట్స్ అందుకున్న శోభితా ధూళిపాళకు తెలుగు ఓటీటీలో 'చీకటిలో' మంచి స్టార్ట్.

Also Readఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ డైరెక్టర్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Municipal Elections 2026 Results: కొడంగల్ మున్సిపాలిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్
Municipal Elections Results: కొడంగల్ మున్సిపాలిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్
Telangana Municipal Elections Results 2026: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న అధికార పార్టీ
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న అధికార పార్టీ
Telangana Municipal Elections 2026 Results: తొలి విజయం బీఆర్ఎస్‌దే.. గడ్డపోతారంలో ఎగిరిన గులాబీ జెండా
మున్సిపల్ ఎన్నికల్లో తొలి విజయం బీఆర్ఎస్‌దే.. గడ్డపోతారంలో ఎగిరిన గులాబీ జెండా
Vana Veera OTT : ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన 'వనవీర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన 'వనవీర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Muscial Road | ముంబైలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సంగీతం పాడుతుంది | ABP Desam
India va Namibia Match Preview | T20 World Cup 2026 లో మోత మొదలు పెడతారా.? | ABP Desam
Rohit Sharma on 2027 ODI World Cup | వన్డే వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని హిట్ మ్యాన్ ధీమా | ABP Desam
Saqlain Mushtaq on Ind vs Pak Match Pitch | మ్యాచ్ ఆడకముందే ఏడుపులు మొదలు | ABP Desam
Sanju Samson Playing Against Namibia | నమీబియాతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్న సంజూ | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Municipal Elections 2026 Results: కొడంగల్ మున్సిపాలిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్
Municipal Elections Results: కొడంగల్ మున్సిపాలిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్
Telangana Municipal Elections Results 2026: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న అధికార పార్టీ
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న అధికార పార్టీ
Telangana Municipal Elections 2026 Results: తొలి విజయం బీఆర్ఎస్‌దే.. గడ్డపోతారంలో ఎగిరిన గులాబీ జెండా
మున్సిపల్ ఎన్నికల్లో తొలి విజయం బీఆర్ఎస్‌దే.. గడ్డపోతారంలో ఎగిరిన గులాబీ జెండా
Vana Veera OTT : ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన 'వనవీర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన 'వనవీర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
టయోటా ఈబెల్లా రివ్యూ: ఈ కారు పేరుకు అర్ధమేంటి? MG, టాటా, హ్యుందాయ్‌కి గట్టి పోటీ ఇవ్వగలదా?
టయోటా ఈబెల్లా ఫుల్‌ రివ్యూ: లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా ఉందా?, ఏవైనా లోపాలున్నాయా?
Telangana Municipal Elections Results 2026: ఆదిలాబాద్ లో క్యాంప్ పాలిటిక్స్,  మ్యాజిక్ ఫిగర్ పై ఉత్కంఠ- క్యాంపులకు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు
ఆదిలాబాద్ లో క్యాంప్ పాలిటిక్స్, మ్యాజిక్ ఫిగర్ పై ఉత్కంఠ- క్యాంపులకు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు
Gandhi Talks OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ సేతుపతి సైలెంట్ మూవీ - 'గాంధీ టాక్స్' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ సేతుపతి సైలెంట్ మూవీ - 'గాంధీ టాక్స్' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Srisailam Maha Shivaratri 2026: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజులపాటు టోల్ ఛార్జీలు రద్దు
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజులపాటు టోల్ ఛార్జీలు రద్దు
Embed widget