Suma Adda Latest Promo: ఓర్నీ... సుమక్కకే పంచ్ వేసిన వింధ్య, గీత - బాయ్‌ఫ్రెండ్‌తో శిల్ప 'అఆ ఉఊ'లు
Suma Kanakala: సుమ కనకాల యాంకరింగ్ చేస్తున్న షోలలో 'సుమ అడ్డా' ఒకటి. ఈ వారం ఆ షోకి యాంకర్స్ గాయత్రీ భార్గవి, శిల్పా చక్రవర్తి, గీతా భగత్, విద్య వచ్చారు. షోలో సుమ మీద పంచ్ డైలాగ్స్ పడ్డాయి.
![Suma Adda Latest Promo: ఓర్నీ... సుమక్కకే పంచ్ వేసిన వింధ్య, గీత - బాయ్‌ఫ్రెండ్‌తో శిల్ప 'అఆ ఉఊ'లు Suma Adda Latest Promo Anchor Vindhya punch to Suma Kanakala and Shilpa Chakravarthy boyfriend dialogue gone viral Suma Adda Latest Promo: ఓర్నీ... సుమక్కకే పంచ్ వేసిన వింధ్య, గీత - బాయ్‌ఫ్రెండ్‌తో శిల్ప 'అఆ ఉఊ'లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/57a694b754623af5c585e7965cbb0d651716098003405313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Suma Adda Latest Episode Promo: 'ఈ పంచింగ్ ఫలక్ నామాకే పంచ్' అని 'ఆర్య' సినిమాలో సునీల్ డైలాగ్ చెబుతారు. గుర్తుందా? 'సుమ అడ్డా' షో లేటెస్ట్ ప్రోమో చూసిన ఆడియన్స్ కొందరికి సేమ్ టు సేమ్ ఆ ఎక్స్‌ప్రెషన్ గుర్తు వచ్చింది. వై? ఎందుకు? అంటే... అలవోకగా పంచ్ డైలాగ్స్ వేసే సుమక్క మీద పంచ్ వేసింది ఓ యంగ్ యాంకర్. ఆ వివరాల్లోకి వెళితే...
'సుమ అడ్డా'లో యాంకర్స్ స్పెషల్!
మే 25న టెలికాస్ట్ కానున్న 'సుమ అడ్డా' షోకి నలుగురు యాంకర్లు అతిథులుగా వచ్చారు. గాయత్రీ భార్గవి, శిల్పా చక్రవర్తి, గీతా భగత్, వింధ్య... సుమ కనకాల (Suma Kanakala)తో కలిసి ఈ నలుగురూ సందడి చేయనున్నారు. లేటెస్టుగా ప్రోమో విడుదల చేశారు.
స్పోర్ట్స్ ఈవెంట్స్, ఐపీఎల్ (Anchor Vindhya)కు వింధ్య యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య గీతా భగత్ సైతం ముంబైలో కొన్ని ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తున్నారు. వీళ్లిద్దరూ స్టేజి మీదకు వచ్చినప్పుడు ''వెల్కమ్! ఇద్దరూ ఈ మధ్య బాంబే యాంకర్లు అయిపోయారే'' అని సుమ అన్నారు. ఆ వెంటనే వింధ్య ''ఇక్కడ మీరు ఏ స్లాట్ ఇవ్వడం లేదని అక్కడికి వెళ్లాల్సి వచ్చింది'' అని రివర్స్ పంచ్ వేసింది. తొలుత సుమ పంచ్ వేసినప్పుడు షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన గీతా భగత్, వింధ్య డైలాగ్ తర్వాత ఒక్కసారిగా నవ్వేసింది.
గీతా భగత్ కూడా తక్కువేమీ తినలేదు. సినిమా ప్రెస్ మీట్స్, ఈవెంట్లలో ఆమె ప్రాసతో డైలాగ్స్ వేస్తుంది. 'సుమ అడ్డా'లో స్కిట్ చేసినప్పుడు కూడా ఆ ప్రాస కంటిన్యూ అయ్యింది. సుమ హాస్టల్ వార్డెన్, గీతా భగత్ స్టూడెంట్ రోల్ చేశారు. ''మీ అమ్మా నాన్న నా మీద నమ్మకంతో హాస్టల్‌లో ఇక్కడ పెడితే...'' అని సుమ అంటే... ''మీ మీద నమ్మకంతో పెట్టలేదు. శంషాబాద్ లో మా సైట్ అమ్మకంతో పెట్టారు. అంత ఫీజు కడుతున్నాం'' అని గీతా భగత్ రివర్స్ పంచ్ వేసింది.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
వింధ్య, గీతా భగత్ కంటే ముందు గాయత్రీ భార్గవి, శిల్పా చక్రవర్తి స్టేజి మీదకు వచ్చారు. అప్పుడు ''ఇవాళ నాకు కాంపిటీషన్'' అని సుమ అనగానే... ''సుమ గారికి సుమ గారే కాంపిటీషన్! ఒక ఓ వేసుకోండి అందరూ'' అని శిల్పా చక్రవర్తి పొగిడింది. ప్రోమో చూస్తుంటే నలుగురూ కలిసి ఒక రేంజ్ సందడి చేసినట్టు ఉన్నారు.
శిల్పాకు బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వచ్చాడు!
Shilpa Chakravarthy remembers her boyfriend: 'సుమ అడ్డా'లో ఒక స్టూడెంట్ పుషప్స్ చేస్తుంటే తనకు బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వచ్చాడని శిల్పా చక్రవర్తి చెప్పింది. ''పెళ్లైతే నీకు ఇద్దరు పిల్లలు పుట్టేవారు. మళ్లీ బాయ్ ఫ్రెండ్ గుర్తుకు వస్తున్నాడట'' అని సుమ ఆ సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేశారు. కానీ, శిల్పా చక్రవర్తి ''ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదు మేడమ్'' అని గట్టిగా చెప్పింది. బాయ్ ఫ్రెండ్ తో అలా తిరగడానికి వెళ్లి డ్యాన్స్ చేశానని, ఆ తర్వాత ''ఊ ఆ'' అంటూ ఏం జరిగిందో చెప్పడానికి అందరికీ తెలిసేలా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది శిల్పా చక్రవర్తి. అదీ సంగతి.
Also Read: పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)