Oh Bhama Ayyo Rama Trailer: కాంప్రమైజ్ అయితే పెళ్లి... కాంట్రవర్సీ చేస్తే ఫైట్ - గెస్ట్ రోల్స్‌లో టాప్ డైరెక్టర్స్... సుహాస్ 'ఓ భామ అయ్యో రామ' ట్రైలర్ చూశారా?
Oh Bhama Ayyo Rama: సుహాస్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఓ భామ అయ్యో రామ'. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Suhas's Oh Bhama Ayyo Rama Trailer Released: ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న యంగ్ హీరో సుహాస్ మరో క్రేజీ స్టోరీ 'ఓ భామ అయ్యో రామ'తో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కుతుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ అదుర్స్
రామ్ గోదల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సుహాస్ డైరెక్టర్ రోల్ చేస్తున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. 'రెడీ సార్... సీన్ 47' అనే షాట్‍తోనే ట్రైలర్ ప్రారంభం కాగా... మాళవిక, సుహాస్‌కు ఫోన్ చేసి పబ్‌కు రమ్మని పిలవగా... సీన్ కట్ చేస్తే శ్మశానానికి షిఫ్ట్ అవుతుంది. ఇద్దరూ శ్మశానంలో సమాధిపై కూర్చోగా... చేతబడి అంటూ మాళవిక చెప్పడం సుహాస్ ఆందోళనకు గురి కావడం ఫన్నీగా అనిపిస్తాయి. వ్యాన్‌కు సుహాస్‌ను కట్టేసి వెనుక రౌడీలు రావడం, పంచెతో పరిగెత్తడం కామెడీ జోష్ పెంచింది.
'కాంప్రమైజ్ అయితే పెళ్లి అవుద్ది. కాంట్రవర్శీ చేస్తే ఫైట్ అవుద్ది' అంటూ హరీష్ శంకర్, సుహాస్ చెప్పే డైలాగ్ ఆసక్తి పెంచేసింది. 'అమ్మాయిలు అయస్కాంతం లాంటి వారు. వెళ్లిపోవడమే కానీ ఆగిపోవడం ఉండదు.' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్ అన్నీ కలగలిపి ఓ ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లా మూవీ తెరకెక్కిందని తెలుస్తోంది.
Also Read: బాక్సాఫీస్ మీద నితిన్ గురి తప్పింది... 'తమ్ముడు' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
గెస్ట్ రోల్స్‌లో టాప్ డైరెక్టర్స్
ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హరీష్ శంకర్, మారుతి గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తుండడం మరింత హైప్ క్రియేట్ చేసింది. ఓ వైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఎమోషనల్‌గా ట్రైలర్ సాగింది. లవ్, ఎమోషనల్, కామెడీ, రొమాంటిక్ అన్నీ మేళవించి ఫుల్ ట్రీట్ అందించనున్నట్లు తెలుస్తోంది. సుహాస్ సినిమాలో డైరెక్టర్‌గా లేదా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
స్పెషల్ రోల్‌లో నువ్వు నేను ఫేం
ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ 'నువ్వు నేను' ఫేం అనిత స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. ఆ సినిమా తర్వాత ఆమె శ్రీరామ్‌లో నటించారు. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించినా అంతగా పేరు సంపాదించలేదు. పలు డబ్బింగ్ సీరియల్స్‌లోనూ కనిపించారు. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అనిత 'ఓ భామ అయ్యో రామ' మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రైలర్‌లో ఆమె లుక్ ఆసక్తికరంగా మారింది.
View this post on Instagram
ఈ సినిమాలో సుహాస్, మాళవికతో పాటు అలీ, బబ్లూ పృథ్వీరాజ్, రవీందర్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ బ్యూటీ మాళవికకు ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. వీఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్లా మూవీని నిర్మిస్తుండగా.. ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















