Spirit Movie: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్ - 'స్పిరిట్' అప్డేట్ వచ్చేసింది
Prabhas: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది గుడ్ న్యూస్. అవెయిటెడ్ మూవీ 'స్పిరిట్'పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా... త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

Prabhas Spirit Movie Shooting Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబో అవెయిటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ హైప్ మామూలుగా లేదు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. తాజాగా... ఈ మూవీ షూటింగ్‌పై బిగ్ అప్డేట్ వచ్చింది.
అప్పటి నుంచి షూటింగ్
ప్రస్తుతం సందీప్ వంగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా... సెప్టెంబర్ నుంచే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు సందీప్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముందుగా మిగిలిన వారితో షూటింగ్ పూర్తి చేయనుండగా... ప్రభాస్ నవంబర్ నుంచి షూటింగ్‌లో పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దీని కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. దీనికి తగ్గట్లుగానే టీం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్‌లో 'ది రాజాసాబ్' మూవీలో నటిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే హను రాఘవపూడి చేస్తోన్న చిత్రాన్ని సైతం పరుగులు పెట్టిస్తున్నారు. ఈ ప్రాజెక్టులతో పాటే 'స్పిరిట్' మూవీని కూడా ట్రాక్ ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
హై ఓల్టేజ్ పోలీస్ ఆఫీసర్
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సందీప్ వంగాతో ప్రభాస్ మూవీ అంటేనే హైప్ మామూలుగా ఉండదు. హై ఓల్టేజ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కించబోతున్నారు. మోస్ట్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు మూవీ నిర్మించనున్నాయి.
ప్రభాస్ సరసన హీరోయిన్‌గా తృప్తి దిమ్రి నటిస్తున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమె ఒక్కరే అని కన్ఫర్మ్ చేశారు. తొలుత హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ను అనుకున్నా అనుకోని కారణాలతో ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అయితేనే ప్రభాస్‌కు పర్ఫెక్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వచ్చాయి. డైరెక్టర్ సందీప్‌కు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ రుక్మిణి వసంత్ ప్రభాస్ సరసన నటిస్తారనే ప్రచారం సాగింది. చివరకు 'యానిమల్' బ్యూటీ తృప్తి దిమ్రినే ఒకే ఒక్క హీరోయిన్ అని సందీప్ స్పష్టం చేశారు.
కీలక యాక్టర్స్ ఎవరంటే?
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లను కూడా సందీప్ తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో వీరిద్దరూ నెగిటివ్ రోల్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇతర కీలక రోల్స్ కోసం కూడా అమెరికాతో పాటు కొరియా నుంచి కూడా యాక్టర్స్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. 2027లో 'స్పిరిట్' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.






















