Kaliyugam OTT Release Date: రిచ్చెస్ట్ వరల్డ్‌లోకి మీకు వెళ్లాలని ఉందా? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'కలియుగం'... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Kaliyugam OTT Platform: లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కలియుగం' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ మూవీ అందుబాటులోకి రానుంది.

Shraddha Srinath's Kaliyugam OTT Release On SunNXT: హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, సైన్స్ ఫిక్షన్స్ అంటే ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భవిష్యత్ ఎలా ఉండబోతుందో అనే ఓ ఐడియాతో తీసిన మూవీస్ మంచి విజయం సాధించాయి. గతేడాది వచ్చిన 'కల్కి 2898 AD' మూవీ కూడా అలాంటిదే. తాజాగా... మరో తమిళ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్
2064లో ప్రపంచం ఎలా ఉండబోతుందో అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ 'కలియుగం'. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 11 నుంచి ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ కానుంది. 'ప్రపంచం అంతం అయినప్పుడు మీరు ఏం అవుతారు? ఆశ, భయం, మనుగడ, చీకటిగా మారిన భవిష్యత్తు అన్నీ కలిస్తే ఎలా ఉంటుంది?' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పాటు ఓ ఆసక్తికర పోస్టర్ కూడా షేర్ చేసింది.
ప్రమోద్ సుందర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. తమిళంతో పాటు తెలుగులోనూ మూవీ అందుబాటులోకి రానుంది.
View this post on Instagram
స్టోరీ ఏంటంటే?
ప్రపంచం అంతమైన తర్వాత ఏం జరిగింది అనేదే బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. 2064లో ధనవంతులు ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. మానవాళి అంతమైన తర్వాత మిగిలిన కొందరు అందులోకి వెళ్లాలని కలలు కంటారు. ఆహారం, నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్లాలని సామాన్యులు ప్లాన్ వేస్తారు. అలా వెళ్లిన శక్తి, భూమి అనే ఇద్దరు వ్యక్తులకు ఎదురైన పరిస్థితి ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ కథ మొత్తం శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్‌ల చుట్టూనే తిరుగుతుంది.
Also Read: 'జూరాసిక్ వరల్డ్ రీ బర్త్' రివ్యూ: పిల్లలకు నచ్చతుంది... మరి పెద్దలకు? సినిమా ఎలా ఉందంటే?
మరిన్ని మూవీస్ కూడా...
ఇదే 'సన్ నెక్స్ట్' ఓటీటీలో మరిన్ని మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. జయప్రకాష్ రెడ్డి, మీనాక్షీ దినేశ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ 'కర్కి'. పవిత్రన్ తెరకెక్కించిన ఈ సినిమా కూడా ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటే అవినాశ్ వర్మ, ఆద్యా రెడ్డి జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'జగమెరిగిన సత్యం' ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇతివృత్తంగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'మద్రాస్ మ్యాట్నీ' కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో సత్యరాజ్, కాళీ వెంకట్ కీలక పాత్రలు పోషించారు.





















