Deepika Padukone: బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్‌కు అరుదైన గౌరవం - తొలి ఇండియన్‌గా రికార్డు
Deepika Walk Of Fame: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ అంతర్జాతీయ స్థాయిలో ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. 'హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026'కు ఎంపికయ్యారు.

Deepika Padukone Received Hollywood Walk Fame Star: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో 'హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026'కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ప్రకటన జారీ చేసింది.
మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో విశేష కృషి చేసిన వారిని గౌరవిస్తూ ప్రతి ఏటా హాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ 'హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్' జాబితాను రిలీజ్ చేస్తుంది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్‌గానూ దీపిక నిలిచారు.
Also Read: 'కాంతార' మేకర్స్ 'మహావతార్: నరసింహ' - ఆ నామమే అన్నింటికీ సమాధానం... ప్రహ్లాదుడి ప్రోమో అదుర్స్
దీపికతో పాటు...
దీపికాతో పాటుగా హాలీవుడ్ స్టార్స్ డెమి మూర్, రాచెల్ మెక్ఆడమ్స్, ఎమిలీ బ్లంట్, స్టాన్లీ టుస్సీ, టిమోతీ చలమెట్ వంటి వారితో మొత్తం 35 మంది ఈ జాబితాలో ఉన్నారు. తనకు ఈ గౌరవం దక్కడంపై దీపిక స్పందించారు.
'అంతర్జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు నా వర్క్ గురించి మాత్రమే కాదు. అందరికీ దాని అర్థం ఏంటో తెలియజేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దక్షిణాసియా ప్రాతినిధ్యానికి మరింతగా మార్గం సుగమం చేస్తుందని నేను ఆశిస్తున్నాను.' ప్రపంచ వేదికపై భారతదేశానికి సాంస్కృతిక రాయబారిగా దీపికా ఎంపిక కావడంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దీపికా అరుదైన ఘనతలు
అంతర్జాతీయ స్థాయిలో దీపికా పదుకోన్ ఇలాంటి ఘనత సాధించడం ఇదే మొదటిసారి కాదు. టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో తొలి 100 మందిలో ఒకరిగా నిలిచారు. ఆ తర్వాత టైమ్ 100 ఇంపాక్స్ అవార్డు అందుకున్నారు. అలాగే ఖతార్‌లో జరిగిన FIFA ఫైనల్స్‌లో ప్రపంచ కప్ ట్రోఫీని ప్రధానం చేసిన ఫస్ట్ ఇండియన్ గా నిలిచారు. ఐకానిక్ గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లు లూయిస్ విట్టన్, కార్టియర్‌లకు ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్‌గా దీపిక వార్తల్లో నిలిచారు.
దీపికా పదుకోన్ మోడలింగ్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2006లో కన్నడ మూవీ 'ఐశ్వర్య'తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఉపేంద్ర హీరోగా నటించారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన 'ఓం శాంతి ఓం' మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 2017లో 'త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆప్ జాండర్ కేజ్' సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గా వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
బన్నీ అట్లీ ప్రాజెక్టులో...
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తోన్న 'AA22XA6' (వర్కింగ్ టైటిల్) మూవీలో ఆమె హీరోయిన్‌గా నటించనున్నారు. ఇటీవలే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' సినిమాలో దీపికా హీరోయిన్‌గా నటించారు. ఇప్పుడు మరోసారి డైరెక్టర్ హీరోయిన్ కాంబో రిపీట్ కానుంది.
ఈ మూవీలో ఆమె వారియర్ ప్రిన్సెస్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపికాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా చోటు ఉండనున్నట్లు తెలిపింది. బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తుండగా... సినిమాకు 'ఐకాన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.





















