బాలీవుడ్లో సూపర్ స్టన్నింగ్, గ్లామర్, సక్సెస్ఫుల్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె ఒకరు. ఈ భామ తన లుక్స్‌తో, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా దీపికా ఏ తరహా డ్రెస్ వేసిన తనదైనా స్టైల్లో అదరగొడుతుంది. దీనికి కారణం ఆమె ఫిట్నెస్. ఫిట్‌గా ఉంటే చాలు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. మనం దానిని గ్రేట్‌గా ఎక్స్ప్లోర్ చేయొచ్చని చెప్తోంది దీపికా. దీపికా పదుకొణె పైలేట్స్ని తన ఫిట్నెస్ రోటీన్లో భాగంగా చేస్తుంది. కండరాల బలాన్ని పెంచడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. శరీర సమతుల్యతను పెంచి.. బలాన్ని అందించడమే కాకుండా.. కండరాలకు మంచి ఆకృతిని అందిస్తాయి. రోప్ వర్క్వుట్లు కూడా ఆమె ఫిట్నెస్ రొటీన్లో భాగమే. మార్షల్ ఆర్ట్స్ కూడా చేస్తుంది దీపికా. కండరాలను టోన్ చేసి.. క్యాలరీలను బర్న్ చేయడంలో ఇవి ప్రభావవంతగా హెల్ప్ చేస్తాయి. యోగా కూడా ఆమె ఫిట్నెస్ రొటీన్లో భాగమే. స్ట్రెచ్‌లతో పాటు.. వివిధ యోగా ఆసనాలు చేస్తూ ఉంటుంది. కిక్‌బాక్సింగ్‌తో డైనమిక్, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇవి ఆమె పూర్తి ఫిట్‌నెస్‌కు హెల్ప్ చేస్తుంది. డీప్ ఫ్రైడ్, కార్బ్స్ ఎక్కువ ఫుడ్‌కి వెళ్లకుండా.. సింపుల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటుంది. రసం అన్నమంటే మాత్రం చాలా ఇష్టమట.