(Source: Poll of Polls)
Jatadhara Trailer: ప్రాణాలు తీసే ధన పిశాచి... రక్షించే 'జటాధర' - ఆసక్తికరంగా సుధీర్ బాబు కొత్త మూవీ ట్రైలర్
Jatadhara Trailer Reaction: సుధీర్ బాబు లేటెస్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'జటాధర' మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఇంట్రెస్టింగ్ కథాంశంతో భయపెట్టేలా ఉన్న ట్రైలర్ కట్ ఆకట్టుకుంటోంది.

Sudheer Babu's Jatadhara Trailer Review: సూపర్ నేచరల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేెటెస్ట్ మూవీ 'జటాధర'. థ్రిల్లర్ అంశాలతో ముడిపెడుతూ డివోషనల్ టచ్ బ్యాక్ డ్రాప్‌గా వెంకట్ కల్యాణ్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్ గూస్ బంప్స్ తెప్పించాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ వేరే లెవల్‌లో ఉంది.
స్టోరీ అదేనా?
గుప్త నిధులు... వాటికి కాపలాగా ఉండే శక్తులు... వాటిని చేజిక్కించుకునేందుకు ఇచ్చే బలులు. సైన్స్‌ను తప్ప దెయ్యాలు లేవని నమ్మే హీరో వీటన్నింటినీ బ్యాక్ డ్రాప్‌గా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో 'జటాధర'ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'పూర్వం ధనాన్ని భూమిలో దాచిపెట్టి దాన్ని రక్షించేందుకు మంత్రాలతో బంధనాలు వేసేవారు. ఆ బంధనాలలో అతి భయంకరమైన బంధనం పిశాచ బంధనం.' అంటూ ఓ ఇంట్రడక్షన్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తిని పెంచేసింది.
హీరో సుధీర్ బాబు సైన్స్‌ను మాత్రమే నమ్మి దెయ్యాలను నమ్మని ఓ ఘోస్ట్ హంటర్ అని తెలుస్తుండగా... హీరోయిన్ ఆర్కియాలజిస్ట్ అని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా 'ధన పిశాచి'గా భయపెట్టేశారు. ఓ ఇంట్లో లంకె బిందెలు తీయాలని క్షుద్ర పూజలతో పిశాచి బంధనం విడిపించేందుకు యత్నించగా అది విఫలమై నర బలి కోరుతున్నట్లుగా స్టోరీ ఉంది. ఇందులోనే వచ్చే కలలను బట్టి జరిగే ఘటనలను కూడా చూపించారు. 'నాట్ ఆల్ స్పిరిట్స్ ఆర్ ఫ్రెండ్లీ. కొన్ని వెరీ డేంజరస్. వాటిని మెప్పించేందుకు జంతు బలులు ఇస్తుంటారు. కొన్నిసార్లు నరబలులు కూడా ఇస్తుంటారు.' అనే డైలాగ్ భయం పెడుతోంది.
అసలు ఈ లంకెబిందెల స్టోరీ ఏంటి?, పసిబిడ్డను నరబలిగా ఎవరు కోరుకున్నారు? గుప్త నిధులు నిజంగా ఉన్నాయా? ధన పిశాచి కథ ఏంటి? సైన్స్‌కు, కలలకు, మనం కలిసే వారికి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ట్రైలర్ క్లైమాక్స్‌లో ధన పిశాచితో సుధీర్ బాబు ఫైట్ సీన్... రక్తంతో ఆయన సీన్ వేరే లెవల్‌లో ఉంది. ఇదివరకు ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'జటాధర' రాబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 7న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: ఈస్ట్ గోదావరి అబ్బాయి... వెస్ట్ గోదావరి అమ్మాయి - ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ 'ఆనందలహరి'
ఈ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటించగా... బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా 'ధన పిశాచి'గా కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు యాంకర్ ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, అవసరాల శ్రీనివాస్, రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో కేఆర్ బన్సల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీలో నవంబర్ 7న రిలీజ్ కానుంది.
He stands where the forgotten evil rises.. The divine mystery unfolds with #Jatadhara in theaters from Nov 7th..#JatadharaTrailer out now!
— Sudheer Babu (@isudheerbabu) October 17, 2025
Telugu▶️:https://t.co/Yhz8linLzB
Hindi▶️:https://t.co/BWb881E5kY#JatadharaOnNov7#UmeshKrBansal #PrernaArora @zeestudios_…





















