అన్వేషించండి

Vishwambhara : 'విశ్వంభర'లో కోలీవుడ్ స్టార్ - మెగాస్టార్‌ను ఢీకొట్టే పాత్రలో?

Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర' మూవీలో కోలీవుడ్ స్టార్ శింబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తాజా సమాచారం.

Kollywood Star In Megastar's Vishwambhara : స్టార్ హీరోల సినిమాల్లో ఇతర భాషల నటీనటులు నటిస్తుండడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ కొత్త సినిమాలోనూ ఓ తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ తమిళ స్టార్ హీరో ఎవరు? అనే వివరాల్లోకి వెళితే...

'విశ్వంభర' లో కోలీవుడ్ స్టార్ హీరో

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర' లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. సినిమాలో శింబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలు తెలుగు సినిమాల్లో విలన్ గా మెప్పించారు. అల్లు అర్జున్ నటించిన 'వరుడు' సినిమాలో ఆర్య విలన్ గా అదరగొట్టగా.. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన 'ఉప్పెన' లో విజయ్ సేతుపతి కూడా నెగిటివ్ రోల్ లో మెప్పించారు. ఇక ఇప్పుడు శింబు కూడా మెగాస్టార్ 'విశ్వంభర' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. అయితే శింబు ఇందులో మెయిన్ విలన్ గా చేస్తున్నారా? లేక నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

'విశ్వంభర' షూటింగ్ తో మెగాస్టార్ బిజీ అయ్యేది అప్పుడే..

'విశ్వంభర' సినిమాని మొదలుపెట్టి చాలా రోజులు అవుతోంది. ఇటీవల ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. కాకపోతే ఆ షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొనలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలో చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, హీరోయిన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మూవీటీమ్ క్లారిటీ ఇవ్వలేదు. గత కొద్ది రోజులుగా ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే హీరోయిన్ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.

భారీ ధరకు 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్

'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ 18 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొత్తంలో ఓ సినిమాకు ఓవర్సీస్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రావడం ఇదే మొదటిసారి. సీనియర్ హీరోలలో రూ.15 కోట్లకు పైగా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడవ్వడం ఇప్పటివరకు జరగలేదు. ఇది కేవలం మెగాస్టార్ సినిమాకి మాత్రమే సాధ్యమైంది. 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కునున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రల్ లో ఉండబోతోంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : ‘ఎర్రచీర’ ట్రైలర్ - హర్రర్ మూవీలో యాక్షన్ మసాలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
ధనుర్మాసం స్పెషల్: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Embed widget