SSMB29 Title: అవును... మహేష్ - రాజమౌళి సినిమా టైటిల్ ఆప్షన్స్‌లో అదొకటి!
Mahesh Babu Rajamouli Movie Title: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) పాన్ వరల్డ్ 'గ్లోబ్ ట్రాటింగ్' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలైనా జక్కన్న నుంచి ఒక్క అప్డేట్ రాలేదు. ఆఖరికి పూజ ఫోటోలు కూడా బయటకు రానివ్వలేదు. సెట్స్ నుంచి వీడియోలు లీక్ కావడం తప్ప! ఇప్పుడు ఈ సినిమా గురించి మాంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. టైటిల్ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యింది.
వారణాసి... టైటిల్ ఆప్షన్స్‌లో ఇదొకటుందీ!
మహేష్ - రాజమౌళి సినిమాకు 'వారణాసి' టైటిల్ ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమాను రాజమౌళి తీస్తున్నారు. అటువంటి సినిమాకు 'వారణాసి' టైటిల్ ఏమిటి? అని కొందరిలో సందేహం మొదలైంది. ఎందుకంటే... రాజమౌళి లాస్ట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'లో 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చింది. ఇప్పుడు హాలీవుడ్ చూపు సైతం ఆయన సినిమాపై ఉంటుంది. ఇటువంటి తరుణంలో 'వారణాసి' టైటిల్ చర్చనీయాంశం అయ్యింది.
రాజమౌళి తన ప్రతి సినిమాకు కథను బట్టి టైటిల్ ఖరారు చేస్తారు. 'ఆర్ఆర్ఆర్' అని షార్ట్ కట్ నేమ్ వాడినా... ఆ సినిమాకు 'రౌద్రం రణం రుధిరం' అని క్యాప్షన్ ఇచ్చారు. 'వారణాసి' గురించి భారతీయ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే... ఆధ్యాత్మికంగా, చారిత్రక పరంగా 'వారణాసి' నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అందువల్ల టైటిల్ గురించి మహేష్ - రాజమౌళి అభిమానులు నిశ్చితంగా ఉండొచ్చు.
'అవతార్: ద ఫైర్ అండ్ యాష్' సినిమా ప్రచార కార్యక్రమాల కోసం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నవంబర్ నెలలో ఇండియా రానున్నారు. ఆయన చేత మహేష్ మూవీ టైటిల్ రివీల్ చేయించాలనేది రాజమౌళి ప్లాన్.
Also Read: కళ్యాణీ ప్రియదర్శన్ గ్లామర్ ట్రీట్... బెల్లీ డ్యాన్స్‌తో షేక్ ఆడించిందంతే
మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో హాలీవుడ్ వరకు వెళ్లిన ఇండియన్ సినిమా హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. పాన్ ఇండియా గుర్తింపు ఉన్న తమిళ్ స్టార్ ఆర్ మాధవన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.





















