Kalyani Priyadarshan: కళ్యాణీ ప్రియదర్శన్ గ్లామర్ ట్రీట్... బెల్లీ డ్యాన్స్‌తో షేక్ ఆడించిందంతే
ఫిమేల్ సూపర్ హీరో సినిమా 'కొత్త లోక'తో కల్యాణీ ప్రియదర్శన్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతలో వేసుకున్నారు. ఇప్పుడు 'జీనీ'లోని పాటలో గ్లామర్‌గా కనిపించి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.

కల్యాణీ ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ఏంటి? ఆవిడ ఫిమేల్ సూపర్ హీరో సినిమా చేయడం ఏమిటి? అని 'లోక' సినిమా విడుదలకు విమర్శలు చేసిన వ్యక్తులు కొందరు ఉన్నారు. ఆ అమ్మాయిని ప్రధాన పాత్రకు తీసుకుని నిర్మాతగా దుల్కర్ సల్మాన్ రిస్క్ చేస్తున్నాడా? అని ఆఫ్ ది రికార్డ్ సందేహాలు వ్యక్తం చేసిన ఇండస్ట్రీ జనాలు సైతం ఉన్నారు. అయితే 'కొత్త లోక' (తెలుగు టైటిల్) విజయంతో అందరికీ సమాధానం చెప్పారు కల్యాణీ ప్రియదర్శన్. ఇప్పుడు సూపర్ హీరో రోల్ నుంచి గ్లామరస్ గాళ్ రోల్ చేసి అందరికీ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
కల్యాణీ ప్రియదర్శన్ బెల్లీ డ్యాన్స్ చూశారా?
రవి మోహన్ కథానాయకుడిగా రూపొందుతున్న ఫాంటసీ ఫిల్మ్ 'జీనీ' (Tamil Movie Genie). ఇందులో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి ఓ హీరోయిన్. కల్యాణీ ప్రియదర్శన్ మరొక హీరోయిన్. సినిమాలో 'అబ్ది అబ్ది...' పాటను విడుదల చేశారు.
Kalyani Priyadarshan in Abdi Abdi video song: 'జీని'లో కొత్త పాట చూస్తే... కల్యాణీ ప్రియదర్శన్ గ్లామర్ లుక్, బెల్లీ డ్యాన్స్ ఆడియన్స్ అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఫిమేల్ సూపర్ హీరోగా ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సుల్లో ఆవిడను చూసిన ఆడియన్స్... ఒక్కసారిగా గ్లామర్ గాళ్ కింద చూసి షాక్ అయ్యారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Also Read: పవన్ సినిమాలో విలన్ రోల్... రిజక్ట్ చేసిన పాపులర్ పొలిటీషియన్!
అఖిల్ అక్కినేని 'హలో', మెగా సుప్రీమ్ స్టార్ సాయి దుర్గా తేజ్ 'చిత్రలహరి'... తెలుగులో కల్యాణీ ప్రియదర్శన్ రెండు సినిమాలు చేశారు. ఆ రెండిటిలోనూ ఇంత గ్లామరస్ అవతార్ లేదు. అందులోనూ యాక్షన్ చేసిన అమ్మాయి ఒక్కసారిగా గేర్ గ్లామర్ వైపు షిఫ్ట్ చేయడం కూడా స్వీట్ సర్‌ప్రైజ్ అని చెప్పాలి. కథానాయికగా, నటిగా తనకు సవాళ్లు అంటే ఇష్టమని... 'జీనీ' దర్శకుడు భువన్ ఈ పాట గురించి చెప్పినప్పుడు తాను ఎగ్జైట్ అయ్యానని, కథలో కమర్షియల్ పాటకు చక్కగా చోటు కల్పించారని కల్యాణీ ప్రియదర్శన్ తెలిపారు. ఈ సినిమా కాకుండా తమిళంలో 'మార్షల్' సినిమాలోనూ ఆవిడ నటిస్తున్నారు.





















