(Source: Poll of Polls)
SSMB29: మహేష్ బాబు, రాజమౌళి మూవీకీ ముహూర్తం ఫిక్స్? షూటింగ్ ఆ రోజు నుంచేనా?
ప్రేక్షకులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మహేష్ బాబు- రాజమౌళిల కాంబోలో రాబోతున్న సినిమా గురించి క్రేజ్ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీని ఆగష్టు 9న మేకర్స్ అధికారికంగా లాంచ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి
SSMB29 : ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత దిగ్గజ ధీరుడు రాజమౌళి తీయబోయే సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ తీయనున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై ఇంట్రస్టింగ్ అప్ డేట్ రివీల్ అయింది. ఈ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ డ్రామాను మేకర్స్ ఆగష్టు 9న అధికారికంగా లాంఛ్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
'SSMB29' కోసం ఎస్ఎస్ రాజమౌళి కథను పూర్తిగా సిద్ధం చేయడానికి దాదాపు రెండు నెలలు పడనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అతను ఆయన దాన్ని మరొక సారి మహేష్ బాబుకు వివరిస్తారని, ఆ తర్వాత ఆగస్ట్ 9న సూపర్ స్టార్ పుట్టినరోజున ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్ని ప్రీ-విజువలైజేషన్, ప్రీ-ప్రొడక్షన్ షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్న ఈ సినిమా.. 2024లో ప్రారంభం కానున్నట్టు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనిని, ఇది అమీర్ ఖాన్ చిత్రంలో భాగమని వచ్చే ఊహాగానాలు కేవలం పుకార్లేనని ఇటీవలే మేకర్స్ ధృవీకరించారు. ఇక కాస్టింగ్ విషయానికొస్తే, చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. కాబట్టి మహేష్ బాబుతో చేయబోయే మూవీ కోసం రాజమౌళి ఎవరినీ సంప్రదించే అవకాశం లేదని సమాచారం.
రాజమౌళి సినిమా అంటేనే భారీ బడ్జెట్ తో కూడుకున్నది, ఎంత లేట్ అయినా క్వాలిటీ సినిమాను ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. దాని కోసం ఆయన ఎంత రిస్క్ అయినా చేస్తారన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తీయబోయే ఈ మహేష్ బాబు సినిమాపైనా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సారి ఆయన తెరకెక్కించే ఈ పాన్ ఇండియా మూవీకి మంచి మార్కెట్ తప్పక ఉంటుందని ఇప్పట్నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాను 2025లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో సుమారు రూ.1,500 కోట్ల భారీ బడ్జెట్‌లో తీయబోతున్నట్లు సమాచారం. అనేక దేశాలలో రిలీజ్ కానున్న ఈ సినిమా కథ విస్తృతిని దృష్టిలో ఉంచుకొని దీన్ని రెండు లేదా మూడు భాగాలుగా తీయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే గనక నిజమైతే, కేవలం రెండేళ్ళలోనే ఒక్కో భాగం పూర్తిచేయగలరనుకున్నా మరో 5-6 ఏళ్ళ వరకు మహేష్ బాబు మరో సినిమా చేయలేరు. కానీ మామూలుగానే రాజమౌళి అంతకంటే ఎక్కువ సమయమే తీసుకొంటారు తప్ప ముందుగా ముగించలేరని వేరే చెప్పక్కరలేదు. ఆ సినిమాలు కూడా తప్పకుండా సూపర్ హిట్ అవ్వొచ్చు. వాటికీ ఆస్కార్ వచ్చినా రావచ్చు.
కానీ మరో 5-6 ఏళ్ళు మహేష్ బాబు మరో సినిమా చేయలేరంటే అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే. ఈ గ్యాప్‌లో మిగిలిన హీరోలు లేదా కొత్త హీరోలు హాయిగా సినిమాలు చేసుకొంటూ నంబర్ 1 స్థానంలో నిలుస్తుంటే, మహేష్ బాబు మాత్రం టాలీవుడ్‌లో ఉన్నప్పటికీ దానికి దూరంగా వేరే ప్రపంచంలో ఉండిపోతారని కొందరు భావిస్తున్నారు.
Read Also : ఏడు పేజీల డైలాగ్ ఒక్క టేక్‌లో, మహేష్ బాబుకు ఆ పాత్ర సూట్ అవుతుంది: మనోజ్ బాజ్‌పాయ్