అన్వేషించండి

ఏడు పేజీల డైలాగ్ ఒక్క టేక్‌లో, మహేష్ బాబుకు ఆ పాత్ర సూట్ అవుతుంది: మనోజ్ బాజ్‌పాయ్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్‌తో ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరైన మనోజ్ బాజ్‌పాయ్.. తన తాజా చిత్రం ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

నోజ్ బాజ్‌పాయ్.. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ తప్పకుండా గుర్తుకొస్తుంది. ఆ సీరిస్‌కే కాదు.. మనోజ్ పాత్రకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతగా ప్రేక్షకుల అభిమానం పొందిన మనోజ్ బాజ్‌పాయ్.. తాజాగా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ‘జీ5’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే హిందీలో సూపర్ హిట్ సాధించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మనోజ్ బాజ్‌పాయ్ తెలుగు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మూవీ విశేషాలు, తన కెరీర్ గురించి చెప్పారు. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను చిన్న చిన్న పాత్రల కోసం తిరుగుతున్నప్పుడు నాలో టాలెంట్‌ను గుర్తించిన వ్యక్తి ఆర్జీవీ. ఆయనే నా మెంటర్. ఆయన్ని ఎప్పటికీ నేను మరిచిపోను’’ అని తెలిపారు. అలాగే, బాలీవుడ్‌లో ఈ రోజు కొత్త కొత్త నటీనటులతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు వస్తున్నాయంటే కారణం ఆర్జీవేయేనని అన్నారు. ‘సత్య’ మూవీ బాలీవుడ్ ఎంతోమందికి దారి చూపిందన్నారు. 

సింగిల్ టేక్‌లో ఏడు పేజీల డైలాగ్ చెప్పా: మనోజ్

మనోజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై.. చిత్రం ఇంత పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని మేం ఎవ్వరం ముందుగా ఊహించ‌లేదు. ఓ మంచి సినిమాను చేయాల‌ని మేం భావనంతో మేమంతా ఎంతో కష్టపడి పనిచేశాం. ఈ సినిమా క్లైమాక్స్‌ ప్రేక్షకులకు చాలా నచ్చిందట. మా డైరెక్టర్ అపూర్వసింగ్ క‌ర్కి క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ కోసం మూడు నాలుగు కెమెరాలు పెట్టారు. సింగిల్ టేక్‌లో ఏడు పేజీలున్న మోనోలాగ్‌ను కంప్లీట్ చేయాల‌ని నాతో అన్నారు. అందుకు నాకు రెండు రోజుల స‌మయం కూడా ఇచ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే సింగిల్ టేక్‌లో పూర్తి చేయాల‌నుకుని.. నేను వాటిని నేర్చుకుని.. బాగా ప్రాక్టీస్ చేసి చేశాను. ఇప్పుడు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. 

‘‘ఈ చిత్రంలో నేను చేసిన సోలం అనే లాయ‌ర్ పాత్ర కామ‌న్ మ్యాన్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఎన్నో కష్టనష్టాలున్నప్పటికీ దాన్ని చిరున‌వ్వుతో ఎదుర్కొనే సాధార‌ణ మధ్యతరగతి ప్రజలందరికీ ఈ పాత్ర ఓ ఉదాహ‌ర‌ణ‌. సోలంకి పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. అందుక‌నే మంచి అప్రిషియేష‌న్స్ వ‌స్తున్నాయి. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ కాన్సెప్ట్‌ను మ‌న చుట్టూ జ‌రుగుతున్న ప‌లు నిజ ఘ‌ట‌న‌ల‌ల‌ను ఆధారంగా  త‌యారు చేశాం. ప్రధానంగా ఈ  సినిమా అంతా 16 ఏళ్ల అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఆమె త‌న జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులను ఇందులో చూపించాం’’ అని పేర్కొన్నారు. 

మహేష్ బాబుకైతే ఆ పాత్ర సూట్ అవుతుంది

‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ మూవీలో మీరు చేసిన పాత్రకు తెలుగులో ఎవరు సరిగ్గా సరిపోతారని మీరు బావిస్తున్నారనే ప్రశ్నకు మనోజ్ సమాధానమిస్తూ.. ‘‘ఇప్పటికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాయ‌ర్‌గా చేసి మెప్పించారు. మ‌హేష్ బాబు అయితే ఈ పాత్రకు సూట్ అవుతార‌నిపిస్తోంది’’ అని తెలిపారు. ఇటీవల మీరు చూసిన తెలుగు సినిమాలేంటనే ప్రశ్నకు మనోజ్ బదులిస్తూ.. ‘‘ఇటీవలే నేను ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చూశాను’’ అని తెలిపారు. హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు రాయ‌ల‌సీమ రుచులుకు వెళుతుంటాను. ఎందుకంటే నాకు స్పైసీ ఫుడ్ బాగా ఇష్టం. అలాగే బిర్యానీని కూడా ఇష్టంగా తింటాను’’ అని పేర్కొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather Latest Update: మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
SSMB29: మహేష్ - రాజమౌళి సినిమాపై క్యాస్టింగ్ రూమర్స్... క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్
మహేష్ - రాజమౌళి సినిమాపై క్యాస్టింగ్ రూమర్స్... క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్
Revanth Reddy: తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
IPL 2024:  ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH Qualified For IPL 2024 Playoffs | కొనసాగుతున్న కెప్టెన్ కమిన్స్ విజయ పరంపర | ABP DesamSRH vs GT Match Highlights | IPL 2024 ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయిన సన్ రైజర్స్ | ABP DesamChandragiri TDP MLA Candidate Pulivarthi Nani | చంద్రగిరి ఇది..పులివెందుల కానివ్వను | ABP DesamNattikumar About IPAC | జగన్ లేని వైసీపీ లాంటిదే ప్రశాంత్ కిషోర్ లేని ఐప్యాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather Latest Update: మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
SSMB29: మహేష్ - రాజమౌళి సినిమాపై క్యాస్టింగ్ రూమర్స్... క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్
మహేష్ - రాజమౌళి సినిమాపై క్యాస్టింగ్ రూమర్స్... క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్
Revanth Reddy: తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
IPL 2024:  ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
Vidya Vasula Aham Review - విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
చనిపోయిన ఆత్మీయుల వస్త్రాలు, ఇతర వస్తువులు వాడుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?
చనిపోయిన ఆత్మీయుల వస్త్రాలు, ఇతర వస్తువులు వాడుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?
T Safe App: టీ సేఫ్‌తో మీ ప్రయాణం సేఫ్, తెలంగాణ పోలీసుల బాసట - ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు
టీ సేఫ్‌తో మీ ప్రయాణం సేఫ్, తెలంగాణ పోలీసుల బాసట - ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు
Krishnamma OTT Streaming: కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!
కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!
Embed widget