News
News
X

SSMB28 Movie Update : మహేశ్ కోసం త్రివిక్రమ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ - మామూలుగా ఉండదు మరి

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా స్టార్ట్ కానుందని తెలిసింది.

FOLLOW US: 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి... అతడు. రెండు... ఖలేజా. 'అతడు' కల్ట్ క్లాసిక్ కాగా... 'ఖలేజా' మహేశ్‌కు కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి హ్యాట్రిక్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

సెప్టెంబర్ రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ సినిమా (SSMB28) రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ రెండో వారంలో స్టార్ట్ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారట. యాక్షన్ సీక్వెన్సుతో షూట్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది.

బ‌స్‌ల‌తో ఫైట్... మామూలుగా ఉండదు!
మహేశ్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట. అందులో చాలా బస్సులు ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం ఆ ఫైట్ సీక్వెన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. అది మామూలుగా ఉండదని టాక్. మహేశ్ బాబు డేర్ డెవిల్ స్టంట్స్ చేయడానికి ప్రిపేర్ అవుతోందట. ఘట్టమనేని ఫ్యాన్స్, ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

త్రివిక్రమ్ మాస్ అంటే మామూలుగా ఉండదు!
మహేశ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'అతడు'లో పొలంలో తీసిన ఫైట్ మాసీగా ఉంటుంది. అలాగే, 'జల్సా'లో ముఖేష్ రుషి పొలంలో ఉత్తరాది మనిషిని బెదిరించే సీన్... 'అరవింద సమేత వీరరాఘవ'లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ కూడా చాలా మాసీగా ఉంటాయి. బావుంటాయి. అందువల్ల, మహేశ్ బాబు లేటెస్ట్ మూవీలో మాస్ ఫైట్ అనేసరికి అభిమానుల్లో అంచనాలు పెరగడం సహజం.

తరుణ్ లేడు... రోషన్ మాథ్యూ ఉన్నాడు!
మహేశ్ బాబు సినిమాలో తరుణ్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, తనను ఎవరూ సంప్రదించలేదని తరుణ్ స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత టాక్ ఏంటంటే... రోషన్ మాథ్యూకు కీలక పాత్ర దక్కిందని తెలుస్తోంది. మాలయాళంలో కొన్ని సినిమాలు చేయన, విక్రమ్ 'కోబ్రా'లోనూ కీలక పాత్ర చేశారు. ఆయన నటన నచ్చడంతో త్రివిక్రమ్ మంచి రోల్ ఆఫర్ చేశారట.

Also Read : 'బాహుబలి 2'లో ఆ సీన్ వెనుక ఉన్నది పవన్ కళ్యాణే

పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.

త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడి సినిమా అంటే ఫైట్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. భారీ మాస్ యాక్షన్ సీన్లు తీస్తారు. సో... మహేశ్ నుంచి మాస్ ఆశిస్తున్న అభిమానులకు ఇప్పుడు ఈ త్రివిక్రమ్ సినిమా, ఆ తర్వాత సినిమా యాక్షన్ విందు అందిస్తాయని చెప్పవచ్చు.  

Also Read : 'కోబ్రా' రివ్యూ : విక్రమ్ సినిమా ఎలా ఉంది? తెలుగులో హిట్ అవుతుందా?

Published at : 01 Sep 2022 03:12 PM (IST) Tags: Mahesh Babu Trivikram SSMB28 Action Scenes In SSMB28 Mahesh Dare Devil Stunt Scene

సంబంధిత కథనాలు

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?