Sreeleela: శ్రీ లీల డ్యాన్స్ ఎక్కడ? సూపర్ హిట్ డ్యాన్స్ బస్టర్‌లో సైడ్ చేశారుగా!
Sreeleela In Dekhlenge Saala Song: మోస్ట్ ట్యాలెంటెడ్ డ్యాన్సర్లలో తెలుగు అమ్మాయి శ్రీ లీల ఒకరు. హీరో ఎవరైనా, సాంగ్ ఏదైనా ఆమె డ్యాన్స్ హైలైట్ అవ్వాల్సిందే. కానీ ఫస్ట్ టైం పాటలో ఆవిడను సైడ్ చేశారు.

తెలుగు అమ్మాయి, మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల పేరు చెబితే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆవిడ డ్యాన్స్. ఇప్పటి వరకు ఈ అందాల భామ చేసిన సినిమాలు చూడండి... హీరో ఎవరైనా సరే, సాంగ్ ఏదైనా సరే ఆవిడ డ్యాన్స్ మాత్రం హైలైట్ అవుతుంది. బట్, ఫర్ ద ఫస్ట్ టైమ్... ఓ పాటలో శ్రీ లీలను సైడ్ చేశారు.
దేఖ్ లేంగే సాలా... శ్రీ లీలను చూడలేదా!?
Sreeleela In Ustaad Bhagat Singh Songs: 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి మొదటి పాట 'దేఖ్ లేంగే సాలా' విడుదల అయ్యింది. మరుసటి క్షణం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నారు. అభిమానులు మాత్రమే కాదు... ప్రేక్షకులు సైతం పవన్ డ్యాన్సులో స్వాగ్, గ్రేస్ చూసి షాక్ అయ్యారు.
'దేఖ్ లేంగే సాలా...' సాంగ్ రిలీజ్ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. అయితే ఆ పాటలో శ్రీ లీల ఉన్న సంగతి చాలా మంది గమనించడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడత పెట్టి...' సాంగ్ కావచ్చు లేదంటే మాస్ మహారాజా రవితేజ 'ధమాకా', 'మాస్ జాతర' సినిమాల్లో పాటలు కావచ్చు... శ్రీ లీల డ్యాన్స్ హైలైట్ అయ్యింది. కానీ మొదటిసారి ఆమె డ్యాన్స్ చేయలేదు. సింపుల్ స్టెప్స్ వేసింది. పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా స్టెప్స్ వేయలేదు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కాస్త కాలు కదిపారు. దాంతో ఫోకస్ అంతా ఆయన మీదకు షిఫ్ట్ అయ్యింది.
Also Read: రోజుకు 20 గంటలు పని చేసిన పవన్... ఆయన వల్ల 'ఉస్తాద్' లేటవ్వలేదు - హరీష్ శంకర్
పవన్ 'ఉస్తాద్...' మీద శ్రీ లీల ఆశలు
Sreeleela Upcoming Movies: శ్రీ లీల కథానాయికగా నటించిన చివరి మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. క్రిటిక్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. దాంతో ఇప్పుడు ఆవిడ 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద ఆశలు పెట్టుకుంది. తెలుగులో శ్రీ లీల చేతిలో ఉన్న స్టార్ హీరో సినిమా ఇదొక్కటే. దీని కంటే ముందు తమిళ హీరో శివకార్తికేయన్ జంటగా నటించిన 'పరాశక్తి'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, వచ్చే ఏడాది ఆవిడ హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం కానుంది.





















