Sree Vishnu: శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ - హిట్ కాంబినేషన్‌లో సినిమా అప్డేట్ ఏమిటంటే?
Sree Vishnu New Movie 2024: శ్రీవిష్ణు హీరోగా లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలపై హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

యువ కథానాయకుడు శ్రీ విష్ణు (Sree Vishnu) వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్నారు. ఆయన నటించిన 'ఓం భీమ్ బుష్' ఈ ఏడాది విడుదలైంది. ఆ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించింది. 'సామజవరగమన' సినిమాతో గత ఏడాది ఆయన భారీ విజయం అందుకున్నారు. అంతకు ముందు 'అల్లూరి' సినిమాలో నటనకు మంచి పేరు వచ్చింది.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చేస్తున్న శ్రీ విష్ణు
ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ... ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్రీ విష్ణు. 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' తర్వాత ఆయన చేయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. 'నాన్నకు ప్రేమతో', 'పుష్ప' వంటి హిట్ చిత్రాలకు రచయితగా పని చేసిన హుస్సేన్ షా కిరణ్ (Hussain Sha Kiran) దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది.
My next :)
— Sree Vishnu (@sreevishnuoffl) April 17, 2024
The chase begins under @HussainShaKiran ❤️
Will meet you all again with a fully packed chill entertainer … until then, keep tracking the clues 😉@Reba_Monica @HussainShaKiran @kaalabhairava7 @sreekar_prasad @vidya7sagar @SunnyGunnam @VKC001 @Lightboxoffl… pic.twitter.com/AmGzG4QI01
శ్రీ విష్ణు సరసన 'సామజవరగమన' రెబా!
Sree Vishnu New Movie Cast And Crew: శ్రీ విష్ణు, హుస్సేన్ షా కిరణ్ సినిమాను లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో రెబా మోనికా జాన్ హీరోయిన్ (Reba Monica John).
Also Read: అల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!
'సామజవరగమన' సినిమాలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించారు. ఆ సినిమాతో ఆవిడ తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తర్వాత మరోసారి శ్రీ విష్ణుతో నటిస్తున్నారు. సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''ఇదొక ఎగ్జయిటింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఆల్రెడీ 60 పర్సెంట్ షూటింగ్ పూర్తి చేశాం. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వీర్ ఆర్యన్, అయ్యప్ప శర్మ, సుదర్శన్, 'రచ్చ' రవి తదితరులు కీలక తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: మనీషా ఎ.దత్, నిర్మాణ సంస్థలు: లైట్ బాక్స్ మీడియా - పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్మెంట్, ఛాయాగ్రహణం: విద్యాసాగర్, సంగీతం: కాల భైరవ, నిర్మాతలు: సందీప్ గుణ్ణం - వినయ్ చిలకపాటి, దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

