అన్వేషించండి

South Cinema Richest Actress: దక్షిణాదిలో ఆమే రిచ్చెస్ట్ హీరోయిన్, నికర ఆస్తుల విలువెంతో తెలుసా?

సౌత్ లో పలువురు హీరోయిన్లు వరుస సినిమాలో దూసుకెళ్తున్నారు. ఒక్కో సినిమాకు కోట్లల్లో పారితోషికం తీసుకుంటున్నారు. అయితే, సౌత్ రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరు? ఆమె ఆస్తుల విలువెంతో ఇప్పుడు తెలుసుకుందాం..

కప్పుడు అద్భుతమైన నటనా ప్రాధాన్య ఉన్న పాత్రలు చేసే వారు పాత తరం హీరోయిన్లు. చక్కటి అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను అలరించే వారు. రానురాను పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్ గా చూపించే ప్రయత్నం చేశారు చిత్ర నిర్మాతలు. కానీ, గత కొంత కాలంగా మళ్లీ పరిస్థితులు మారుతున్నాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పలువురు హీరోయిన్లు బాగా రాణిస్తున్నారు. అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నారు. రెమ్యునరేషన్ విషయంలోనూ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు కోట్లల్లో పారితోషికం తీసుకుంటున్నారు. ఇంతకీ సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతురాలైన హీరోయిన్లు ఎవరో తెలుసా?

వాస్తవానికి హీరోలతో పోల్చితే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగానే ఉంటుంది. కానీ, కొంత మంది హీరోయిన్లు హీరోలతో సమానంగా పారితోషికం తీసుకుంటున్నారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన లేడీ సూపర్ స్టార్లు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలలో రాణిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాలలో కూడా కనిపిస్తున్నారు. ఈ టాప్ సౌత్ ఇండియన్ నటీమణులు ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు.  

1. నయనతార

38 ఏళ్ల వయసున్న నయనతార ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. సౌత్ లోని అన్ని సినిమా పరిశ్రమల్లో అద్భుత గుర్తింపు తెచ్చుకున్న నయనతార, త్వరలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది.  షారుఖ్‌తో కలిసి ‘జవాన్‌’తో అరంగేట్రం చేయనుంది. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ.165 కోట్లు. సౌత్ లో రిచ్చెస్ట్ హీరోయిన్ గా నయనతార కొనసాగుతోంది.

2. తమన్నా

'మిల్కీ బ్యూటీ' తమన్నా ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ నటీమణులలో ఒకరుగా కొనసాగుతోంది. 33 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 110 కోట్లు.

3. అనుష్క శెట్టి

‘బాహుబలి’ హీరోయిన్ అనుష్క శెట్టి తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.  41 ఏళ్ల అనుష్క శెట్టి నికర విలువ దాదాపు రూ. 100 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

4. సమంత రూత్ ప్రభు

‘శాకుంతలం’ నటి సమంతా రూత్ ప్రభుకు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత నికర ఆస్తుల విలువ పలు నివేదికల ప్రకారం, దాదాపు రూ. 89 కోట్లు.

5. రష్మిక మందన్న

'నేషనల్ క్రష్' రష్మిక మందన్న అల్లు అర్జున్‌తో కలిసి చేసిన ‘పుష్ప’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో దేశ వ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ‘పుష్ప2’లో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.28 కోట్లు.

6. పూజా హెగ్డే

పూజా హెగ్డే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. సల్మాన్‌ ఖాన్‌తో ఆమె నటించిన ‘కిసికి బాయ్, కిసీకి జాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది. తాజా నివేదికల ప్రకారం పూజా హెగ్డే నికర ఆస్తుల విలువ రూ. 50 కోట్లు.

Read Also: నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో మందు బాటిళ్లు కొట్టేసిన దొంగలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Embed widget