Sonu Sood: సోనూ సూద్ వాట్సాప్ బ్లాక్ - 61 గంటల్లో 9483 మంది మెసేజ్‌లు
Sonu Sood WhatsApp: తాజాగా రియల్ హీరో సోనూ సూద్ వాట్సాప్ బ్లాక్ అవ్వడంతో ఇబ్బంది ఎదుర్కుంటున్నట్టు ట్వీట్ చేశారు. కానీ 61 గంటల వరకు వాట్సాప్ యాజమాన్యం స్పందించలేదు.
Sonu Sood WhatsApp Blocked: కోవిడ్ సమయంలో ఎంతోమంది పేదవారికి సాయం చేసి రియల్ హీరోగా పేరు దక్కించుకున్నారు సోనూ సూద్. ఇప్పటికీ ఎవరికైనా కష్టం వచ్చింది, సాయం కావాలని తెలిస్తే వెంటనే స్పందించడానికి ముందుంటారు. అయితే తాజాగా తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. ఇదే విషయంపై పలుమార్లు వాట్సాప్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కూడా వాళ్లు పట్టించుకోలేదని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. దీంతో తనను సంప్రదించాలి అనుకునేవారికి కష్టమవుతుందని కూడా అన్నారు. వాట్సాప్ తన ఫిర్యాదు స్పందించడం లేదని వాపోయిన.. సోనూ సూద్ ఫైనల్‌గా యాక్సెస్ దొరికిందని బయటపెట్టారు.
61 గంటల తర్వాత..
బ్లాక్ అయిన తన వాట్సాప్ అకౌంట్ 61 గంటల్లో మాళ్లీ మామూలు అయిపోయిందని, చదవని మెసేజ్‌లు కూడా మళ్లీ రీస్టోర్ అయ్యాయని సోనూ సూద్ ట్వీట్ చేశారు. మూడు రోజుల క్రితం ‘నా నెంబర్‌పై వాట్సాప్ పనిచేయడం లేదు. ఇప్పటికీ ఈ సమస్య చాలాసార్లు ఎదుర్కున్నాను. మీ సర్వీస్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ బ్లాక్ అయిన తన వాట్సాప్‌ను స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్‌లో షేర్ చేశారు సోనూ సూద్. ఇక ఆదివారం ‘ఫైనల్‌గా నా వాట్సాప్ రీట్రీవ్ అయ్యింది. 61 గంటల్లోనే 9483 అన్‌రీడ్ మెసేజ్‌లు వచ్చాయి. థ్యాంక్స్’ అంటూ మరో ట్వీట్ షేర్ చేశారు ఈ రియల్ హీరో.
❤️🙏 pic.twitter.com/oxjddrLzPm
— sonu sood (@SonuSood) April 28, 2024
36 గంటలు అయ్యింది..
వాట్సాప్ స్పందించి తన మెసేజ్‌లను రీట్రీవ్ చేయడంతో దాని యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ సోనూ సూద్ ట్వీట్ చేయడంతో వాట్సాప్ యాజమాన్యం స్పందించిందని తెలుస్తోంది. ‘నా అకౌంట్ ఇంకా పనిచేయడం లేదు. ఇప్పటికీ 36 గంటలపైనే అయ్యింది. నా అకౌంట్‌పై వీలైనంత త్వరగా మెసేజ్ చేయండి. వందలాది మంది సాయం కోసం నన్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దయచేసి మీ పని మీరు చేయండి’ అంటూ వాట్సాప్‌ను ట్యాగ్ చేస్తూ సోనూ సూద్ చేసిన ట్వీట్‌పై యాజమాన్యం స్పందించింది. ఫైనల్‌గా 61 గంటల తర్వాత తన వాట్సాప్‌ను మామూలుగా చేసినట్టు తెలుస్తోంది.
వాట్సాప్ ద్వారా కాంటాక్ట్..
అవసరంలో ఉన్నవారి కోసం సోనూ సూద్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వడం మాత్రమే కాకుండా తన వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేశారు. అందుకే తమకు కావాల్సిన సాయం కోసం చాలామంది సోనూ సూద్‌ను వాట్సాప్ ద్వారా కూడా సంప్రదిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో తన వాట్సాప్ పనిచేయకపోతే కష్టాల్లో ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుందని యాజమాన్యానికి బ్యాక్ టు బ్యాక్ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు సోనూ. ఫైనల్‌గా తన వాట్సాప్ మామూలుగా అయ్యి.. మళ్లీ అందరినీ రీచ్ అవ్వడం మొదలుపెట్టారు. 9483 అన్‌రీడ్ మెసేజ్‌లు ఉండడంతో ఆయన స్పందన కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సోనూ సూద్ ‘ఫతే’ అనే యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో జాక్విలీన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో కనిపించనుంది.
Also Read: 'తండేల్'ను రికార్డ్ రేటుకు కొన్న నెట్‌ఫ్లిక్స్ - చైతూ కెరీర్‌లో హయ్యస్ట్, ఎన్ని కోట్లు అంటే?