Thandel: 'తండేల్'ను రికార్డ్ రేటుకు కొన్న నెట్‌ఫ్లిక్స్ - చైతూ కెరీర్‌లో హయ్యస్ట్, ఎన్ని కోట్లు అంటే?
Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'తండేల్' ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఎన్ని కోట్లకు రైట్స్ తీసుకుందంటే?
Naga Chaitanya and Sai Pallavi's Thandel Movie Digital Rights Sold Out To Netflix OTT: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'తండేల్'. ఇందులో ఆయనకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. సెట్స్ మీద ఉండగా రికార్డు రేటుకు 'తండేల్' ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ తీసుకుందని తెలిసింది.
'తండేల్' ఓటీటీ రైట్స్ @ 40 కోట్లు!
Thandel OTT Rights Price: 'తండేల్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రూ. 40 కోట్లకు అమ్ముడు అయ్యాయని తెలిసింది. అక్కినేని నాగ చైతన్య కెరీర్ మొత్తం మీద ఆయన సినిమాకు ఓటీటీ రైట్స్ ద్వారా ఇన్ని కోట్లు రావడం ఇదే తొలిసారి. ఈ 'తండేల్'తో ఆయన రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు.
'తండేల్' సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లాస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా 'కార్తికేయ 2'. తెలుగులో మాత్రమే కాదు... పాన్ ఇండియా లెవల్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. 'తండేల్'కు రికార్డ్ స్థాయిలో ఓటీటీ డీల్ క్లోజ్ కావడం వెనుక డైరెక్టర్ కూడా ఒక రీజన్ అని చెప్పవచ్చు.
Also Read: ఎన్టీఆర్‌ను చుట్టుముట్టిన ముంబై మీడియా... బాలీవుడ్ స్టార్లతో యంగ్ టైగర్ పార్టీ
హైదరాబాద్ సిటీలో 'తండేల్' షూటింగ్!
ప్రజెంట్ 'తండేల్' సినిమా షూటింగ్ హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. హీరో నాగ చైతన్యతో పాటు ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో ప్రేమ కథతో కూడిన సినిమాగా 'తండేల్'ను తెరకెక్కిస్తున్నారు. 'తండేల్'కు ముందు చైతు, సాయి పల్లవి 'లవ్ స్టోరీ'లో జంటగా నటించారు. అది ప్రేమ కథ అయినప్పటికీ... అందులో కథకు, ఈ 'తండేల్'లో ప్రేమ కథకు చాలా వ్యత్యాసం ఉంటుందట.
Thandel Movie Inspiration: వాస్తవ సంఘటనల ఆధారంగా 'తండేల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చేపల వేటకు వెళ్లిన కొందరు వ్యక్తులు (జాలరులు) పాకిస్థాన్ జలాల్లోకి వెళతారు. పాక్ సైన్యం / పోలీసుల చేతికి చిక్కుతారు. ఆ తర్వాత ఏమైంది? పాక్ చేతిలో తెలుగు ప్రజలు ఎన్ని చిత్ర హింసలకు గురి అయ్యారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: ఓటీటీ సందడి... ఈ వారం వచ్చే వెబ్ సిరీస్, సినిమాలు ఏవో తెలుసా?
Thandel Movie Cast And Crew: 'తండేల్' సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి డీ గ్లామరస్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం చైతు తొలిసాటి శ్రీకాకుళం యాసలో మాట్లాడనున్నారు. తన గెటప్, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్ నుంచి వరకు ప్రతి విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: శామ్ దత్, కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల, నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: బన్నీ వాసు, రచన - దర్శకత్వం: చందూ మొండేటి.