అన్వేషించండి

Ram Miriyala New Song: అంజలి సినిమాలో రామ్ మిరియాల పాట - సిరి హనుమంతు ఆట

Geethanjali Malli Vachindi songs: అంజలి 50వ సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'లో రామ్ మిరియాల ఓ పాట పాడారు. అయితే... ఆ సాంగ్ విషయంలో ఓ ట్విస్ట్ ఉంది. 

తెలుగమ్మాయి అంజలి (Anjali) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' (Geethanjali Malli Vachindi Movie). పది సంవత్సరాల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'గీతాంజలి'కి సీక్వెల్ ఇది. ఆ సినిమాలో కథ ఎక్కడ అయితే ముగిసిందో... ఈ సినిమాలో అక్కడి నుంచి ప్రారంభం కానుంది. కథానాయికగా అంజలికి 50వ సినిమా. లేటెస్ట్... అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో 'రెంట్ కి డబ్బు లేదు' సాంగ్ విడుదల చేశారు. 

'గీతాంజలి...'లో రామ్ మిరియాల పాట!
'సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్' అని కమల్ హాసన్ 'ఆకలి రాజ్యం'లో ఓ పాట ఉంది కదూ! ఆ స్ఫూర్తితో 'రెంట్ కి డబ్బు లేదు' సాంగ్ చేసినట్టు ఉన్నారు. 

'రెంట్ కి డబ్బు లేదు...
స్నానానికి సబ్బు లేదు...
సాయంకాలం పబ్బు లేదు...
అయినా తగ్గేది లేదు!

సింగిల్ ఛాయ్ లేదు... 
సిగరెట్టూ పఫు లేదు...
బతుకు మీద ఆశ తప్ప
పెనం మీద దోశ లేదు!
సాపాటు లేదులే ఏదో పాట పాడు బ్రదర్'అంటూ సాగిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా... భాస్కరభట్ల రవికుమార్ సాంగ్ రాశారు.

'రెంట్ కి డబ్బు లేదు సాంగ్...' స్పెషాలిటీ ఏమిటంటే? ఇందులో అంజలి లేరు. శ్రీనివాస రెడ్డి, 'స్వామి రారా' సత్య, 'సత్యం' రాజేష్, షకలక శంకర్ తదితరులతో పాటు 'బిగ్ బాస్' ఫేమ్ సిరి హనుమంతు స్టెప్పులు వేశారు.

Also Read'రానా నాయుడు 2' ఎక్స్‌ క్లూజివ్ అప్డేట్... విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే?

ఏప్రిల్ 11న గీతాంజలి మళ్ళీ వస్తుంది!
Geethanjali Malli Vachindi is scheduled to release on April 11th: 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్టు కోన ఫిల్మ్ కార్పొరేషన్ అనౌన్స్ చేసింది. అమెరికాలో ఏప్రిల్ 10న ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ నెలలో విడుదల చేయాలని మొదట ప్లాన్ చేసినా... క్వాలిటీ కోసం వెనక్కి వెళ్లారు.

Also Readప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ

సంగీత్ మహల్ వైపు వెళ్ళారేంటి?
geethanjali malli vachindi teaser review: అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో కొండ మీద ఉన్న పాడుబడ్డ భవంతి పేరు సంగీత్ మహల్. గ్రామస్థులు ఎవరూ అటువైపు వెళ్లరు. కొందరు అటు వైపుగా వెళ్లడం చూసి ఊరి ప్రజలు ఆశ్చర్యపోతారు. అక్కడ షూటింగ్ ఏదో జరుగుతుందని తెలుసుకుంటారు. 'ఆ మహల్ సంగతి తెలిసే వెళుతున్నారా వీళ్లు?' అని ఓ పెద్దాయన అసహనం వ్యక్తం చేస్తాడు. 

'గీతాంజలి మళ్ళీ వచ్చింది'లో దర్శకుడిగా శ్రీనివాస రెడ్డి నటించారు. ఆయన తీసే సినిమాలో సునీల్ హీరో. సత్య, షకలక శంకర్ తదితరులు షూటింగ్ చేయడానికి వెళతారు. ఆ మహల్ లో దెయ్యాలు వాళ్లను ఏం చేశాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై విశాఖ ఎంపీ, రాజకీయ నేత ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget