అన్వేషించండి

Udit Narayan : వివాదంలో 'మీసాల పిల్ల' సింగర్ ఉదిత్ నారాయణ్ - గాయకుడిపై ఫస్ట్ వైఫ్ కంప్లైంట్

Udit Narayan Controversy : ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్‌పై ఆయన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా గర్భాశయాన్ని తొలగించారంటూ ఆరోపించారు.

Singer Udit Narayan First Wife Files Complaint On Him : ఫేమస్ సింగర్ ఉదిత్ నారాయణ వివాదంలో చిక్కుకున్నారు. తన అనుమతి లేకుండా తన గర్భాశయాన్ని తొలగించారంటూ ఆయన మొదటి భార్య రంజన ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిహార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌‌లో ఉదిత్ నారాయణ్, ఆయన ఇద్దరు సోదరులతో పాటు రెండో భార్యపైనా ఆరోపణలు చేశారు. తనపై క్రిమినల్ కుట్ర పన్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.

మొదటి భార్య ఏం చెప్పారంటే?

ఉదిత్‌తో విడాకుల తర్వాత రంజన ఝా గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు చేశారు. తాజాగా... తన గర్భాశయాన్నే తొలగించారంటూ ఆరోపించారు. 1996లో హెల్త్ చెకప్ కోసం తనను ఢిల్లీలో ఉన్న ఓ ప్రముఖ ఆస్పత్రికి తీసుకెళ్లారని... తన అనుమతి లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని చెప్పారు. తాను తల్లి కాకుండా అడ్డుకునేందుకే ఇలా చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 'ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. మరో అనారోగ్య సమస్యతో డాక్టర్ వద్దకు వెళ్తే అసలు విషయం బయటపడింది. ఉదిత్ నారాయణ్ చేసిన ఈ మోసం తనను మానసికంగా, శారీరకంగా ఎంతో కుంగదీసింది.' అంటూ చెప్పారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే, గతేడాది కూడా ఉదిత్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కాన్సర్ట్‌లో భాగంగా తనతో ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించిన మహిళా ఫ్యాన్‌ను ముద్దు పెట్టుకోవడం అప్పట్లో వివాదమైంది. దీంతో తీవ్ర విమర్శలు రాగా తర్వాత వివరణ ఇచ్చారు. అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేస్తూనే తాను ఇలా చేశానంటూ చెప్పుకొచ్చారు. 

Also Read : మృత్యుంజయ్ Vs విష్ణు విన్యాసం - రిలీజ్ డేట్స్ కాంట్రవర్సీ... శ్రీవిష్ణు రియాక్షన్ ఇదే

1985లో దీప అనే సింగర్‌ను ఉదిత్ నారాయణ్ రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకున్నాడు. ఆ తర్వాత రంజనా అనే మహిళ తనను ఉదిత్ మొదటి పెళ్లి చేసుకున్నారంటూ బయటకు వచ్చారు. ఆమె కోర్టును ఆశ్రయించడంతో డివోర్స్ తీసుకున్నారు. రంజనకు భరణం చెల్లించేందుకు అంగీకరించాడు. ఆ తర్వాత ఉదిత్‌పై ఆమె పలు ఆరోపణలు చేశారు. తనకు భరణం కూడా ఇవ్వడం లేదని చెప్పారు. తాజాగా, ఉదిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కెరీర్ విషయానికొస్తే... తన కెరీర్‌లో ఉదిత్ నారాయణ్ ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. 'కైకలూరి కన్నే పిల్లా', 'అందమైన ప్రేమరాణి', 'కీరవాణి రాగంలో', 'అమ్మాయే సన్నగా', 'పసిఫిక్‌లో దూకేయ్‌మంటే' పాటలతో తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్ మెగాస్టార్, అనిల్ రావిపూడి కాంబో సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీలో 'మీసాల పిల్ల' సాంగ్ పాడారు. ఈ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. యూట్యూబ్‌లో మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

Also Read : ఓటీటీలోకి వచ్చేసిన జీవా తమిళ బ్లాక్ బస్టర్ - 50 కోట్ల మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget