Lavanya Tripathi : ప్రెగ్నెంట్‌గానే 3 నెలల్లో 'సతీ లీలావతి' పూర్తి - భర్త వరుణ్ తేజ్‌తో మూవీపై లావణ్య త్రిపాఠి ఏమన్నారంటే?
Lavanya Tripathi Reaction : వరుణ్ తేజ్ తన జీవితంలోకి రావడం తన అదృష్టమని అన్నారు లావణ్య త్రిపాఠి. 'సతీ లీలావతి' ఈవెంట్‌లో ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Lavanya Tripathi About Movie With Varuntej In Sathi Leelavathi Event : మంచి కథ ఉంటే తన భర్త వరుణ్ తేజ్‌తో కలిసి మూవీ చేస్తానని చెప్పారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి' మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
3 నెలల్లోనే...
ఈ మూవీ ప్రారంభించినప్పుడు తాను ప్రెగ్నెంట్ అని కేవలం 3 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసినట్లు చెప్పారు లావణ్య త్రిపాఠి. 'ఫస్ట్ డే యాక్షన్ సీన్ ప్లాన్ చేస్తే... డైరెక్టర్ వద్దకు వెళ్లి నేను ప్రెగ్నెంట్ అని చెప్పా. ఆయన షాక్ అయ్యారు. అప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కూడా ఎవరికీ చెప్పలేదు. దర్శక నిర్మాతల సపోర్ట్ వల్లే మూవీ చేయగలిగా. ప్రెగ్నెన్సీతోనే మొత్తం మూవీ కంప్లీట్ చేశా. సప్తగిరితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. దేవ్ మోహన్ గారి నటన ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్. మార్చి 6న పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా.' అని అన్నారు.
Also Read : 'ఉస్తాద్...'కు విలన్ - పవన్ కళ్యాణ్ సినిమాలో తమిళ్ యాక్టర్ లుక్ రిలీజ్
'ఫ్యామిలీని అంటే ఊరుకోను'
మెగా ఫ్యామిలీలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు లావణ్య త్రిపాఠి. 'మా ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్ దంపతులకు కవలలు పుట్టారని ఆనందిస్తుంటే ఆ టైంలో ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ ఇబ్బందిగా అనిపించింది. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. నా కుటుంబం గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోను.' అంటూ తెలిపారు.
జెన్ జీ అమ్మాయిలకు సలహా
భార్యాభర్తలిద్దరూ స్నేహితులుగా ఉంటే జీవితం ఆనందంగా సాగుతుందని... ఎప్పుడూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలన్నారు లావణ్య. 'ఏ అమ్మాయి అయినా ఓ మంచి వ్యక్తి అయితే కచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం తీసుకుని అతని గురించి తెలుసుకొని ముందడుగు వేయాలి. మన వైబ్‌కు మ్యాచ్ అవుతారో లేదో చూశాక పెళ్లి చేసుకోవాలి. నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఏడేళ్ల టైం తీసుకున్నా. నాకు పెళ్లై రెండేళ్లు అయ్యింది. ఇద్దరూ ఆనందంగా ఉండాలంటే సహనం మాత్రం చాలా ముఖ్యం. వరుణ్ నా జీవితంలోకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా.' అని అన్నారు.
'సతీ లీలావతి' రిలీజ్ ఎప్పుడంటే?
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన 'సతీ లీలావతి' మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహించగా... ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగమోహన్ నిర్మించారు. నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు కీలకపాత్రలు పోషించారు. పాత 'సతీ లీలావతి' ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ సినిమా కూడా అంతే హిట్ కావాలని కోరుకుంటున్నట్లు నటుడు సప్తగిరి తెలిపారు.
'సతీ లీలావతి' టీం - సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, బ్యానర్: దుర్గాదేవి పిక్చర్స్, నిర్మాత: నాగ మోహన్, దర్శకుడు: తాతినేని సత్య
సంగీతం: మిక్కీ జె మేయర్, సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్, డైలాగ్స్ : ఉదయ్ పొట్టిపాడు, ఆర్ట్ : కొసనం విఠల్, ఎడిటర్ : సతీష్ సూర్య.
























