Thalaivar Thambi Thalaimaiyil OTT : ఓటీటీలోకి వచ్చేసిన జీవా తమిళ బ్లాక్ బస్టర్ - 50 కోట్ల మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Political Drama : ఈ సంక్రాంతికి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'తలైవర్ తంబి తలైమైయిల్' ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

Jiiva's Thalaivar Thambi Thalaimaiyil OTT Streaming In Telugu : సంక్రాంతి తమిళ హిట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కోలీవుడ్ హీరో జీవా ప్రధాన పాత్రలో నటించిన 'తలైవర్ తంబి తలైమైయిల్' (Thalaivar Thambi Thalaimaiyil) జనవరి 15న తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ దాదాపు రూ.50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది కోలీవుడ్‌లో పొంగల్ సినిమాల్లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
తెలుగులోనూ స్ట్రీమింగ్
థియేటర్లలో కేవలం తమిళంలోనే రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మలయాళంలో 'ఫెలిమి' అనే బ్లాక్ బస్టర్‌తో గుర్తింపు తెచ్చుకున్న నితీష్ సహదేవ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఆయనకు కోలీవుడ్‌లో ఇదే ఫస్ట్ మూవీ. జీవాతో పాటు తంబి రామయ్య, ఇళవరసు, ప్రార్థనా నాథన్, జెన్సన్ దివాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కన్నన్ రవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కనన్ రవి నిర్మించారు.
View this post on Instagram
Also Read : ప్రెగ్నెంట్‌గానే 3 నెలల్లో 'సతీ లీలావతి' పూర్తి - భర్త వరుణ్ తేజ్‌తో మూవీపై లావణ్య త్రిపాఠి ఏమన్నారంటే?
స్టోరీ ఏంటంటే?
ఓ గ్రామంలో పెళ్లి జరుగుతుండగా... అదే టైంలో ఓ వ్యక్తి మరణిస్తాడు. ఈ క్రమంలో గ్రామంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. జీవరత్నం (జీవా) గ్రామ పంచాయతీలో కీలక నాయకుడు. గ్రామంలో ఇళవరసు (ఇళవరసు) ఇంట్లో జరిగే పెళ్లి వేడుక కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తుంటాడు. సరిగ్గా ఇదే సమయంలో పెళ్లి జరిగే పక్కింటి మణి (తంబి రామయ్య) ఇంట్లో ఒకరు చనిపోతారు. దీంతో గ్రామంలో గందరగోళం నెలకొంటుంది.
తమ తమ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారమే అటు వివాహం జరగాలని ఇళవరసు కుటుంబం పట్టుబట్టగా... ఇటు మణి కుటుంబం ఆచారం ప్రకారమే అంత్యక్రియలు జరగాలని పట్టుబడుతుంది. గ్రామంలో ఒకేసారి రెండూ జరగాలంటూ ఆందోళన చేస్తారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఈ టైంలో నాయకుడైన జీవరత్నంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు? జీవరత్నం నిర్ణయానికి ఇరు కుటుంబాలు కట్టుబడ్డాయా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
























