అన్వేషించండి

Singer Pravasthi Aradhya: రీల్‌లో మాట్లాడినట్లుగా రియల్‌లో మాట్లాడండి - సింగర్ సునీతకు ప్రవస్తి కౌంటర్

Singer Pravasthi: యంగ్ సింగర్ ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత స్పందించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా ప్రవస్తి తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు. సునీత కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు.

Singer Pravasthi Aradhya Reacts On Sunitha Comments: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది సింగర్ ప్రవస్తి (Pravasthi Aradhya) అంశమే. తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని.. బాడీ షేమింగ్ చేశారంటూ 'పాడుతా తీయగా' నిర్వాహకులపై ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రముఖ సింగర్, ఆ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సునీత (Sunitha) సైతం స్పందించారు. సునీత కామెంట్స్‌పై తాజాగా ప్రవస్తి సైతం మరోసారి స్పందించారు.

రీల్‌లో కాదు.. రియల్‌గా మాట్లాడండి

జడ్జ్ సునీత అన్నట్లుగా తనను ఒళ్లో కూర్చోబెట్టుకుని బుజ్జగించాలని అడగలేదని.. కానీ మినిమం రెస్పెక్ట్ మాత్రమే తాను కోరుకున్నానని ప్రవస్తి తాజా వీడియోలో తెలిపారు. 'రీల్‌లో సునీత ఎంత బాగా మాట్లాడారో.. రియల్‌లో కూడా అలానే మాట్లాడితే ఇదంతా జరిగేది కాదు. సాంగ్స్ సెలక్షన్స్ విషయంలో ముందే మాకు రైట్స్ ఇచ్చారు. నా సాంగ్స్ రిజెక్ట్ చేయడానికి రైట్స్ అయితే ప్రాబ్లమ్ కాదు.

సాంగ్ వినకుండానే ఓ సాంగ్‌కు ముందే కామెంట్స్ ఇచ్చేశారు. నేను చెప్పని పేర్లను సైతం మీరు వీడియోలో చెప్పారు. నేను అడిగిన ప్రశ్నలకు మీ నుంచి ఎందుకు సమాధానం రాలేదు. లిరిక్స్ మర్చిపోయిన వారి గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు.' అని ప్రవస్తి ప్రశ్నించారు.

Also Read: ఏడాది తర్వాత ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులో వచ్చేసిన హన్సిక 'గార్డియన్', స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వాళ్లను ఎందుకు అప్రిషియేట్ చేశారు?

ఎక్కువ లిరిక్స్ ఉన్న పాటలను హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేసి పాడితే సునీత గారు కనీసం గుర్తింపు ఇవ్వలేదని ప్రవస్తి అన్నారు. 'చేతి మీద లిరిక్స్ రాసుకుని వచ్చి, లిరిక్స్ మర్చిపోయిన వాళ్లను అప్రిషియేట్ చేశారు. లిరిక్స్ గుర్తు పెట్టుకుని కష్టపడి పాడిన మమ్మల్ని మర్చిపోయారు. ఇది చాలా హర్టింగ్‌గా ఉంటుంది. నేను అప్ సెట్ అయ్యానని నా దగ్గరకు వచ్చి సునీత గారు మాట్లాడలేదు. ప్రొడక్షన్ వాళ్లతో మాట్లాడిన తర్వాతే సునీత గారు నా దగ్గరకు వచ్చి మట్లాడారు.' అని ప్రవస్తి తెలిపారు.

హర్ట్ చేశారు మేడమ్..

తాను రోడ్డు మీదకు వచ్చి ఈ విషయాలు మాట్లాడానని సునీత మేడమ్ అన్నారని.. ఓ 19 ఏళ్ల అమ్మాయికి ఇది చాలా హర్టింగ్ వర్డ్ అని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేశారు. 'నేనేమీ ధర్నాలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. సునీత మేడమ్ ఆ మాట అనడం చాలా తప్పు. కీరవాణి గారు వెడ్డింగ్‌లో పాడే వారు తన దృష్టిలో సింగర్స్ కాదు అనే మాట అన్నారు.

అది నాకు చాాలా ఇన్సల్టింగ్‌లా అనిపించింది. ఒపీనియన్‌కు ఇన్సల్టింగ్‌కు చాలా తేడా ఉంది. ఆ విషయాన్నే నేను చెప్పాను. నేను ఇంతకు ముందు కూడా చాలా రియాలిటీ షోల్లోనూ ఎలిమినేట్ అయ్యాను. కానీ ఎప్పుడూ కూడా నేను ఇలా వీడియోలు పెట్టలేదు. నాకు అన్యాయం జరిగింది కనుకే ఇలా వీడియోలో నా ఆవేదన చెప్పాను.' అని ప్రవస్తి వివరించారు. 

జ్ఞాపిక ఎంటర్‌ టైన్‌మెంట్స్‌కు..

ఇదే సమయంలో జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సైతం కౌంటర్ ఇస్తూ ప్రవస్తి మరో వీడియో రిలీజ్ చేశారు. 'మేం రైట్స్ అన్నీ చూసుకుని సాంగ్స్ పంపిస్తే వాటిని కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు అందులో మా సెలక్షన్ ఎక్కడ ఉంది. నేను చాలాసార్లు మెలోడీ కోసం అడిగినా ఇవ్వలేదు. నాంపల్లి సాంగ్‌కు తగిన కాస్ట్యూమ్ ఇవ్వలేదు. అది అడిగితేనే నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఆ డ్రెస్ వేసుకుని మీ దగ్గరకు వచ్చినా ఇది కెమెరాలో బాగుంటుంది అని చెప్పారు. నేను పొట్టి పొట్టి బట్టలు అని ఎక్కడా అనలేదు. ఇక్కడ పేవరెటిజమ్ ప్రకారమే నడిచింది. మాకు టైం లేకే అగ్రిమెంట్‌లో సైన్ చేయాల్సి వచ్చింది.' అని ప్రవస్తి వీడియోలో వివరించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget