Chiranjeevi Chinmayi : ఇండస్ట్రీలో నో కాస్టింగ్ కౌచ్ - మెగాస్టార్ కామెంట్స్‌పై సింగర్ చిన్మయి రియాక్షన్
Singer Chinmayi : ఇండస్ట్రీలో నో క్యాస్టింగ్ కౌచ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్‌పై సింగర్ చిన్మయి రియాక్ట్ అయ్యారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నారు.

Singer Chinmayi Reaction On Chiranjeevi No Casting Couch Comments : ఇండస్ట్రీలో టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటే ప్రతీ ఒక్కరూ రాణిస్తారని... కాస్టింగ్ కౌచ్ లాంటివేవీ లేవంటూ మెగాస్టార్ చేసిన కామెంట్స్‌పై సింగర్ చిన్మయి స్పందించారు. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెబుతూ ట్విట్టర్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
'కమిట్మెంట్ అడుగుతారు'
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉందని... కమిట్మెంట్ ఇవ్వకపోతే కొత్త వారికి అవకాశాలు రావని అన్నారు చిన్మయి. 'కమిట్మెంట్ అంటే వృత్తిపరమైన నిబద్ధత అని అర్థం. కానీ, ఇండస్ట్రీలో దాని అర్థం వేరు. కొందరు మగాళ్లు ఈ వర్డ్ ఉపయోగించి మహిళల నుంచి ఏవేవో ఆశిస్తారు. గతంలో ఓ ప్రముఖ సింగర్ ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలకు భయపడి ఈ రంగాన్నే వదిలి వెళ్లిపోయింది. ఆరోపణలు ఎదుర్కొన్న ఎంతో మంది ఇక్కడ వేదికలపై స్పీచెస్ ఇస్తూనే ఉన్నారు.' అంటూ రాసుకొచ్చారు.
Casting couch is rampant, women are refused roles if they don’t offer ‘full commitment’ - a word that means completely different in the film industry.
— Chinmayi Sripaada (@Chinmayi) January 26, 2026
If you come from an English educated background and believe ‘commitment’ means ‘professionalism’, showing up to work and being…
Also Read : విజయ్ 'జన నాయగన్'కు మళ్లీ షాక్ - మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు... రిలీజ్ మరింత ఆలస్యం
చిరంజీవి ఓ లెజెండ్
ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఓ లెజెండ్ అని... ఆయన తరంలో నటీనటులంతా ఎంతో స్నేహభావంతో ఉండేవారని అన్నారు చిన్మయి. 'చిరంజీవి గారి టైంలో ఇండస్ట్రీలో ఒకరినొకరు గౌరవించుకునే వారు. లెజెండ్స్‌తో కలిసి వర్క్ చేసే వారు కూడా నా దృష్టిలో గొప్ప వారే' అని చిన్మయి తెలిపారు.
తాను కూడా గతంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చిన్మయి చెప్పారు. తన తల్లి సమక్షంలోనే ఎంతో నమ్మిన ఓ పెద్దాయన తనతో తప్పుగా ప్రవర్తించాడని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
చిరంజీవి ఏమన్నారంటే?
'మన శంకరవరప్రసాద్ గారు' సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేదే ఉండదని అన్నారు. ఇండస్ట్రీ ఓ అద్దం లాంటిదని మన ఎలా ఉంటే అదే రిజల్ట్ వస్తుందని అన్నారు. టాలెంట్, హార్డ్ వర్క్, స్ట్రాంగ్‌గా నిలబడే ఎవరైనా ఇక్కడ రాణిస్తారని తెలిపారు. 'ఇండస్ట్రీలో మనం ఎలా ఉంటామో ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి వస్తానంటే వారిని ఎంతో ప్రోత్సహించాలి. ఇక్కడ నెగిటివ్ పీపుల్ ఉంటారు. చేదు అనుభవాలు ఎదురవతాయి అంటే అది నీ తప్పిదం.
నువ్వు కచ్చితంగా ఉంటే ఎవరూ అవకాశం తీసుకోరు. ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్‌లు ఉండవు. నువ్వు ప్రొఫెషనల్‌గా నిబద్ధతతో పని చేస్తే ప్రోత్సాహం లభిస్తుంది. న్యూ టాలెంట్‌కు ఇక్కడ ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ ఉంటుంది.' అని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















