అన్వేషించండి

Siddu On Tillu Square Rumours: డీజే టిల్లు తప్పేమీ లేదని చెబుతాడా? సిద్ధూ ఏం నిజాలు మాట్లాడతాడో?

Siddu On DJ Tillu 2 Rumours: సూపర్ హిట్ సినిమా 'డీజే టిల్లు'కు సిద్ధూ జొన్నలగడ్డ సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని చుట్టూ ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటికి చెక్ పెడతానని హీరో అంటున్నారు.

టిల్లు స్క్వేర్ (Tillu Square)... 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్. సినిమా స్టార్టింగ్ నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ సినిమా సీక్వెల్ అని కాదు... హీరోయిన్లు వాకౌట్ చేయడం, సీక్వెల్‌కు దర్శకుడిని చేంజ్ చేయడం వంటి అంశాలు కూడా  'టిల్లు స్క్వేర్'ను వార్తల్లో ఉండేలా చేశాయి. సినిమాపై చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని అంశాల గురించి సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడతానని ట్వీట్ చేశారు. దాంతో ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు? ఏం నిజాలు బయట పెడతారు? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మార్చిలో 'టిల్లు స్క్వేర్' రిలీజ్
Tillu Square Release In March 2023 : ''ప్రేక్షకులు అందరికీ మీరు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు. సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇక.. రూమర్స్ అంటారా? త్వరలో ప్రోపర్ ఇంటర్వ్యూతో పుకార్లు అన్నిటినీ క్లియర్ చేద్దాం'' అని సిద్ధూ జొన్నలగడ్డ ట్వీట్ చేశారు.  'టిల్లు స్క్వేర్'తో ప్రేక్షకులు కొత్త వినోదం అందిస్తానని ఆయన ప్రామిస్ చేశారు. అసలు, 'డీజే టిల్లు' సీక్వెల్ చుట్టూ ఉన్న రూమర్స్ ఏంటి? అనే విషయానికి వస్తే...
  


విమల్ కృష్ణ పోయే...
మల్లిక్ రామ్ వచ్చే!
'టిల్లు స్క్వేర్' విషయంలో మొదట షికారు చేసిన పుకారు... దర్శకుడి మార్పు గురించి! 'డీజే టిల్లు'లో సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కథానాయకుడిగా నటించడం మాత్రమే కాదు... ఆ చిత్ర దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి కథ రాశారు. టిల్లు క్యారెక్టరైజేషన్ వెనుక ఆయన రైటింగ్ కూడా ఉంది. అయితే... సినిమా హిట్ తర్వాత సీక్వెల్ కోసం విమల్ కృష్ణను కాకుండా మరొక దర్శకుడిని తీసుకోవడం డిస్కషన్ పాయింట్ అయ్యింది. విమల్ కృష్ణకు, సిద్ధూ జొన్నలగడ్డ మధ్య క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చాయని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పుడు ఆ టాపిక్ గురించి సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడాల్సి ఉంటుంది. 

అనుపమ పోయే...
మడోన్నా వచ్చే!
'టిల్లు స్క్వేర్' సినిమా ఇప్పుడు వార్తల్లో ఉండటానికి కారణం హీరోయిన్ సినిమా నుంచి తప్పుకోవడం! తొలుత ఈ సినిమాలో 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీలను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే... నిర్మాణ సంస్థలు ఎప్పుడూ ఆ విషయాన్ని వెల్లడించలేదు అనుకోండి. 'టిల్లు స్క్వేర్'లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ అని అఫీషియల్‌గా చెప్పారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే... సినిమాలో అనుపమ లేదు. ఆవిడను తీసేసి, మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian In Tillu Square)ను ఎంపిక చేశారు. అనుపమ సినిమా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? అనేది హాట్ టాపిక్ అవుతోంది.

Also Read : పల్లెటూరిలో యుగాంతం - కార్తికేయ 'బెదురులంక 2012'

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ మధ్య మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయని బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2' చూస్తే తెలుస్తుంది. ఆ షోలో ఉన్నప్పుడు అనుపమకు సిద్ధూ ఫోన్ చేశారు. అప్పుడు బాగా మాట్లాడుకున్నారు. డేట్స్ అడ్జస్ట్ చేయలేక 'టిల్లు స్క్వేర్' నుంచి తప్పుకొన్నారా? లేదంటే మరొక కారణం ఉందా? అనేది ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే తప్ప తెలియదు. అనుపమ కంటే ముందు సిద్ధూ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget