Kartikeya's Bedurulanka 2012 First Look : పల్లెటూరిలో యుగాంతం - కార్తికేయ 'బెదురులంక 2012'
Bedurulanka 2012 Movie First Look : కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తున్న 'బెదురులంక 2012' సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు.
కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'బెదురులంక 2012'. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. సి. యువరాజ్ సమర్పణలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ (రవీంద్ర బెనర్జీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫోటో' సినిమా నిర్మించింది ఈయనే. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు.
'బెదురులంక 2012' ఫస్ట్ లుక్...
Bedurulanka 2012 Movie First Look Released By Nani : ఈ రోజు 'బెదురులంక 2012' సినిమా ఫస్ట్ లుక్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. 'నానీస్ గ్యాంగ్ లీడర్'లో కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదల సమయంలో నాని, కార్తికేయ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన నాని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.
KARTIKEYA: ‘BEDURULANKA 2012’ FIRST LOOK, MOTION POSTER OUT NOW… #Nani unveils #FirstLook + #MotionPoster of #Telugu entertainer #Bedurulanka2012, starring #Kartikeya… Costars #NehaShetty… Directed by #Clax… Produced by #RavindraBenerjeeMuppaneni… Shooting in final stages. pic.twitter.com/ItXHsfU9RV
— taran adarsh (@taran_adarsh) November 30, 2022
కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 21న 'బెదురులంక 2012' టైటిల్ అనౌన్స్ చేశారు. అప్పుడు ఓ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. గోదావరి మధ్యలో ఒక లంక... ఎగసి పడుతున్న అలలు... పైన గద్ద... కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ లుక్ ఆ ఆసక్తిని మరింత పెంచిందని చెప్పాలి.
పల్లెటూరిలో యుగాంతం...
బెదురులంక 2012 కథ ఏంటంటే?
Bedurulanka 2012 Movie Story : ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో 'బెదురులంక 2012' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని చెప్పారు. ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''మోషన్ పోస్టర్ చూస్తే సినిమా ఎంత విభిన్నంగా ఉండబోతుంది? అనేది అర్థం అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్న చిత్రమిది. మా హీరో హీరోయిన్లు కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో సన్నివేశాలు, పాటలు తెరకెక్కించాం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలు అందించారు. అందులో ఓ బాణీకి స్వర్గీయ 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి గారు సాహిత్యం అందించారు. ఛాయాగ్రహణం, కళా దర్శకత్వం... సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో హైలైట్ అవుతాయి'' అని చెప్పారు. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను 'బెదురులంక' అనే కొత్త ప్రపంచంలోకి సినిమా తీసుకు వెళుతుందని... కొత్త కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ఆయన తెలిపారు.
Also Read : ప్రభాస్‌తో ప్రేమ, పెళ్లిపై కృతి సనన్ రియాక్షన్ ఇదే
"డ్రామెడీ (డ్రామా + కామెడీ) జానర్ చిత్రమిది. ఇందులో కొత్త కార్తికేయ కనిపిస్తారు. పల్లెటూరి నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో చిత్రాన్ని రూపొందిస్తున్నాం" అని చిత్ర దర్శకుడు క్లాక్స్ చెప్పారు.
అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృధ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.