అన్వేషించండి

Tillu Square Second Single : మీరంతా రాధిక ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ - 'టిల్లు స్క్వేర్' నుంచి మరో అదిరిపోయే సాంగ్

Tillu Square : 'టిల్లు స్క్వేర్' మూవీ నుండి 'రాధిక' అంటూ సాగే రెండవ పాటని రిలీజ్ చేశారు మేకర్స్. మరోసారి అదరగొట్టేందుకు వచ్చేస్తున్నాడు టిల్లు.

Tillu Square Second Single : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'DJ టిల్లు' సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ 'టికెట్టే కొనకుండా' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. రామ్ మిర్యాల పాడిన ఈ పాటలో సిద్దు, అనుపమల మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ఒక్క సాంగ్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట కూడా సినీ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉంది. 'రాధిక' అంటూ సాగే ఈ పాటలో మరోసారి అనుపమ పరమేశ్వరన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.

"చెప్పురాధికా ఏం కావాలి నీకు? నేను నీకు ఎలా సహాయ పడగలను. రాధిక ఈసారి నా కొంప ఎలా ముంచబోతున్నారు చెప్పు" అంటూ సిద్దు చెప్పే డైలాగ్ తో ఈ లిరికల్ సాంగ్ మొదలైంది." రాధిక ఎవరు? నా పేరు లిల్లి" అని అంటుంది అనుపమ పరమేశ్వరన్." పేరు లిల్లీ అయినా మనిషివైతే రాధిక నువ్వు" అని సిద్దు అంటాడు. DJ టిల్లు మూవీలో రాధిక పాత్రను గుర్తుచేసేలా ఈ డైలాగ్స్ ఉన్నాయి. మీరంతా రాధిక ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్, ఆ గుట్ట మీద నుంచి బైనక్యూలర్ వేసుకుని చూస్తారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు ఏడవుంటారని చెప్పి’’ అంటూ తనదైన స్టైల్‌లో డైలాగ్స్ చెప్పాడు సిద్ధు.

" రాధికా.. రాధిక.. ముందుకా, వెనకకా.. కిందకా మీదకా.. అంటూ షురూ అయిన ఈ సాంగ్ ని రామ్ మిర్యాల ఫుల్ జోష్ తో పాడారు. క్యాచీ లిరిక్స్, ఫాస్ట్ బీట్ తో సాగిన ఈ పాట సినీ లవర్స్ ని ఉర్రూతలూగించడం ఖాయం అని చెప్పవచ్చు. డీజే టిల్లు మూవీలో రాధిక పేరు ఓ బ్రాండ్ లా మారిపోయింది. అదే పేరుతో వచ్చిన ఈ సాంగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'టిక్కెట్టే కొనకుండా' అంటూ గతంలో వచ్చిన ఫస్ట్ సింగిల్ ఎంత పాపులర్ అయిందో ఈ రాధిక సాంగ్ కూడా అంతే పాపులర్ అవుతుంది. ముఖ్యంగా యూత్ ఈ సాంగ్ కి బాగా కనెక్ట్ అవుతారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటని రామ్ మిర్యాల కంపోజ్ చేయడంతో పాటు స్వయంగా పాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ పాట రాబోయే రోజుల్లోనే ఈ ఇయర్ టాప్ టెన్ చార్ట్ బస్టర్ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : సోషల్ మీడియాలో ఆలియా డీప్‌ఫేక్ వీడియో హల్‌చల్ - స్పందించడానికి ఇష్టపడని నటి!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Navy Day 2025 : భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Navy Day 2025 : భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
Super Soft Idlis : ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి
ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి
Embed widget