అన్వేషించండి

Shreyas Talpade: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే‌కు హార్ట్ ఎటాక్ - ‘పుష్ప’లో అల్లు అర్జున్‌కు వాయిస్ ఇచ్చింది ఇతడే!

Shreyas Talpade: ఎన్నో బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్‌లలో నటించి.. యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయాస్ తల్పాడే హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు తనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

‘పుష్ప: ది రైజ్’ మూవీ హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్‌కు డబ్బింగ్ చెప్పిన బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రేయాస్ తన అప్‌కమింగ్ చిత్రానికి షూటింగ్ జరుపుకుంటున్న సమయంలోనే హార్ట్ ఎటాక్ వచ్చిందని బాలీవుడ్ మీడియా అంటోంది. దీంతో తనను ముంబాయ్‌లోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే తనకు ఆంజియోప్లాస్టి చేశారని సమాచారం.

రోజంతా సరదాగా ఉన్నాడు..
ప్రస్తుతం శ్రేయాస్ తల్పాడే ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రోజంతా ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత గురువారం సాయంత్రం శ్రేయాస్‌కు హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలిపోయాడని సమాచారం. దీంతో వెంటనే తనను ముంబాయ్ అంధేరీ వెస్ట్‌లో ఉన్న బెల్లే వ్యూ హాస్పిటల్‌కు తరలించారు. ఆంజియోప్లాస్టి చేయడంతో ప్రస్తుతం శ్రేయాస్ ఆరోగ్యం స్టేబుల్‌గా ఉందని తెలుస్తోంది. రోజంతా షూటింగ్‌లో పాల్గొనడంతో ఇలా జరిగిందా అని బాలీవుడ్ మీడియా.. మూవీ టీమ్‌ను ప్రశ్నించింది. తన సహ నటులు మాత్రం శ్రేయాస్ రోజంతా సరదాగానే ఉన్నాడని, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ తిరిగాడని చెప్పారు. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే తన ఆరోగ్యం బాగా లేదని, ఎందుకో ఇబ్బందిగా ఉందని తన భార్య దీప్తితో చెప్పాడట శ్రేయాస్.

ప్రముఖ హిట్ ఫ్రాంచైజ్‌లో..
గురువారం రాత్రి దాదాపు 10 గంటలకు శ్రేయాస్ తల్పాడేకు ఆంజియోప్లాస్టి చేశారు డాక్టర్లు. ప్రస్తుతం తన ఆరోగ్యం స్టేబుల్ అయ్యిందని, కొన్నిరోజుల్లోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం శ్రేయాస్ నటిస్తున్న ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ అనేది ప్రముఖ బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ ‘వెల్‌కమ్’లో భాగంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్‌లో రెండు సినిమాలు వచ్చి హిట్ కొట్టగా ఇప్పుడు మూడో పార్ట్ షూటింగ్ జరుపుకుంటోంది. ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ చిత్రంలో శ్రేయాస్ తల్పాడేతో పాటు అక్షయ్ కుమార్, దిశా పటానీ, సునీల్ శెట్టి, పరేశ్ రావల్, రవీనా టండన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్ వంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాను అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

సుష్మితా సేన్‌కు కూడా..
బాలీవుడ్‌లో ఒక ప్రముఖ నటుడికి, అది కూడా వయసులో చిన్న అయినవారికి హార్ట్ ఎటాక్ రావడం.. ఈ ఏడాదిలో ఇది రెండోసారి. 2023 మార్చిలో తనకు హార్ట్ ఎటాక్ వచ్చిన విషయాన్ని తాజాగా బయటపెట్టింది సుష్మితా సేన్. దాని వల్ల తనకు కూడా ఆంజియోప్లాస్టి చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసిన సుష్మితా.. ‘కొన్నిరోజుల క్రితం నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆంజియోప్లాస్టి జరిగింది. స్టెంట్ వేశారు. ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు చాలా పెద్ద మనసు ఉందని నా కార్డియోలజిస్ట్ కన్ఫర్మ్ చేశారు’ అని చెప్పింది. అనూహ్యంగా శ్రేయాస్ తల్పాడే వయసు 47 ఏళ్లు కాగా.. సుష్మిత వయసు కూడా 47 ఏళ్లే. ‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున్ డైలాగ్స్‌కు హిందీలో ప్రాణం పోశాడు శ్రేయాస్. అప్పటి నుంచి మరింత ఫేమస్ అయ్యాడు.

Also Read: 2023లో నెటిజన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన మూవీస్ ఇవే - బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో ఆ మూవీ టాప్!

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget