Top Searched Movies 2023: 2023లో నెటిజన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన మూవీస్ ఇవే - బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో ఆ మూవీ టాప్!
Top Searched Movies 2023: ఇండియాలో ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ విడుదల అయ్యింది. ‘జవాన్’ ‘గదర్ 2’, ‘ఆదిపురుష్’ సహా పలు చిత్రాలు టాప్ ర్యాంక్ దక్కించుకున్నాయి.
Top Searched Movies 2023: త్వరలో 2023 పూర్తి కానుంది. 2024లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ నేపథ్యలో ఈ ఏడాది (2023) ఇండియాలో నెటిజన్లు బాగా సెర్చ్ చేసిన టాప్ 10 మూవీస్ లిస్ట్ విడుదల అయ్యింది. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు చేశాయి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. జవాన్ - నెట్‌ఫ్లిక్స్
అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ మూవీలో షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించారు. విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి, సన్యా మల్హోత్రా ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ మూవీ గ్లోబల్ బాక్స్ ఆఫీసు కలెక్షన్ రూ.1160 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
2. గదర్ 2- ZEE5
‘గదర్ 2’ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ నటించారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.60 కోట్లతో తెరకెక్కింది. గ్లోబల్ బాక్స్ ఆఫీసు దగ్గర రూ.686 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ZEE5లో ఉంది.
3. ఓపెన్‌హైమర్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
‘ది బాట్‌మ్యాన్ బిగిన్స్’, ‘ది డార్క్ నైట్’ లాంటి అద్భుత సినిమాలు తెరకెక్కించిన క్రిస్టోఫర్ నోలన్ 'ఓపెన్‌హైమర్' సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 21న విడుదలైంది. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ జె ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ 2023లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా సుమారు రూ. 833.88 కోట్లతో తెరకెక్కింది. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ. 7921.91 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
4. ఆదిపురుష్ - నెట్‌ఫ్లిక్స్
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగేతో పాటు పలువురు కీలక పాత్రలు పోషించారు. రూ.500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ. 350 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
5. పఠాన్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దీపికా పదుకొనే, జాన్ అబ్రహం, సల్మాన్ ఖాన్, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా ఇతర పాత్రల్లో కనిపించారు. రూ.250 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1055 కోట్లు వసూలు చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూడవచ్చు.
6. ది కేరళ స్టోరీ
సుదీప్తో సేన్ దర్శకత్వం వహించి ‘ది కేరళ స్టోరీ’ సినిమాను విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ నటించారు. రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 300 కోట్లు వసూలు చేసింది.
7. జైలర్- అమెజాన్ ప్రైమ్ వీడియో
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించారు. రూ.230 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 650 కోట్లు రాబట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘జైలర్’ మూవీ అందుబాటులో ఉంది.
8. లియో - నెట్‌ఫ్లిక్స్
లోకేష్ కనగరాజ్, విజయ్ దళపతి జంటగా నటించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మడోన్నా సెబాస్టియన్, జార్జ్ మేరియన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్ కీలక పాత్రలు పోషించారు. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 600 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. .
9. టైగర్-3
మనీష్ శర్మ తెరకెక్కించిన ‘టైగర్ 3’లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించారు. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషించారు. రూ.300 కోట్లతో నిర్మించిన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ.463 కోట్లు రాబట్టింది.
10. వారిసు- అమెజాన్ ప్రైమ్ వీడియో
2023లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల్లో విజయ్ నటించిన మరో చిత్రం ‘వారిసు’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, శరత్‌కుమార్, శ్రీకాంత్, ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ, సంగీత సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. రూ.200 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.310 కోట్లకు పైగా వసూలు చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘వారిసు’ సినిమా ఉంది.
Read Also: ‘జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్’ నుంచి ‘మోయే మోయే’ వరకు, 2023లో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన టాప్ మీమ్స్ ఇవే!