అన్వేషించండి

Shraddha Das: బిజినెస్‌మ్యాన్‌తో శ్రద్ధా దాస్ ప్రేమ, పెళ్లి - అసలు సంగతి చెప్పేసిందిగా!

Shraddha Das: తెలుగులో గ్లామర్ రోల్స్‌తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. ఇక ఈ భామ ఒక బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్‌లో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటుందని వార్తలు వైరల్ అయ్యాయి.

Shraddha Das Marriage: వెండితెరపై హీరోయిన్లకు చాలా తక్కువ లైఫ్ ఉంటుంది. ఎంత క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అయినా పెరుగుతున్న పోటీలో ఏదో ఒక సమయంలో వెనకబడిపోతుంది. అలాంటి పోటీని తట్టుకొని నిలబడేవారు చాలా తక్కువమంది ఉంటారు. అలా తెలుగులో హీరోయిన్‌గా మంచి హిట్స్ ఉన్నా కూడా ప్రస్తుతం చేతిలో ఆఫర్లు లేక మిగిలిపోయింది శ్రద్ధా దాస్. ప్రస్తుతం ఈ హాట్ హీరోయిన్ చేతిలో ఒకేఒక్క తెలుగు సినిమా ఉంది. ఇలాంటి సమయంలోనే శ్రద్ధా దాస్ ఒక బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్‌లో ఉందని.. అంతే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటుందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వాటిపై క్లారిటీ ఇవ్వడానికి శ్రద్ధా ముందుకొచ్చింది.

సౌత్‌లోని అన్ని భాషల్లో సినిమాలు

శ్రద్ధా దాస్.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సెకండ్ హీరోయిన్ పాత్రతో. అందుకే తనకు ఎక్కువగా హీరోయిన్‌గా అవకాశాలు దక్కలేదు. దక్కినా కూడా ఆ సినిమాలు ఏవీ బ్లాక్‌బస్టర్ అయ్యి.. తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో ఎక్కువగా సెకండ్ హీరోయిన్, గ్లామర్ రోల్స్‌తోనే శ్రద్ధా గుర్తింపును సాధించింది. తెలుగులో మాత్రమే కాదు.. ఇతర సౌత్ భాషల్లో కూడా శ్రద్ధా దాస్ సినిమాలు చేసింది. హిందీలో కూడా నటించి అక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. గుర్తింపు వచ్చినా రాకపోయినా.. తనకు వచ్చిన అవకాశాలతోనే శ్రద్ధా ముందుకెళ్తోంది. ప్రస్తుతం ‘అర్థం’ అనే తెలుగు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. దాంతో పాటు ‘పారిజాత పర్వం’ అనే చిత్రంలో కూడా ఒక కీ రోల్‌లో కనిపించనుంది. ఇక ఇలాంటి సమయంలోనే తన పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై శ్రద్ధా స్పందించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

శ్రద్ధా దాస్.. గత కొంతకాలంగా ఒక బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్‌లో ఉందని, త్వరలోనే ఆ వ్యక్తిని పెళ్లి కూడా చేసుకోనుందని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక వాటిపై స్పందిస్తూ.. తనకు ఏ బిజినెస్‌మ్యాన్ తెలియదని సమాధానమిచ్చింది శ్రద్ధా. అవన్నీ కేవలం రూమర్స్ అని కొట్టిపారేసింది. ఇక 32 ఏళ్లు వచ్చిన ఈ భామ.. సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లలో పాల్గొని, ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఫాలోవర్స్ దగ్గర మార్కులు కొట్టేస్తుంది. ఇక వెండితెరపై అవకాశాలు రాకపోవడంతో కొన్నాళ్ల పాటు బుల్లితెరపై ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా కూడా వ్యవహరించింది శ్రద్ధా దాస్.

‘పారిజాత పర్వం’తో..

తెలుగులో తనకు ఎక్కువగా గ్లామర్ షోకు సంబంధించిన పాత్రలే వచ్చినా.. ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’ వంటి చిత్రాల్లో తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో కూడా బయటపెట్టింతది శ్రద్ధా దాస్. తన మాతృభాష అయిన బెంగాలీలో కూడా ఒకట్రెండు సినిమాల్లో నటించినా అక్కడ కూడా తనకు లక్ కలిసిరాలేదు. ప్రస్తుతం చైతన్య హీరోగా నటిస్తున్న ‘పారిజాత పర్వం’లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో సునీల్, హర్ష చెముడు, శ్రీకాంత్ అయ్యర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రద్ధా దాస్‌తో పాటు మరో హీరోయిన్ మాళవికా సతీషన్ కూడా ఈ సినిమాలో అలరించనుంది. దీని తర్వాత శ్రద్ధా దాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు.

Also Read: నాన్నగారు నా మనసులో చెప్పిన మాటను నిజం చేశాను - ‘నా సామిరంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget