అన్వేషించండి

Shah Rukh Khan: ఇష్టదైవం వైష్ణో దేవిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్ - సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

తన ప్రతీ సినిమా విడుదల ముందు ఇష్టదైవం వైష్ణో దేవిని సందర్శించుకోవడం షారుఖ్ ఖాన్‌కు అలవాటు. అదే తనకు సెంటిమెంట్‌గా కూడా మారిపోయింది.

మామూలుగా తమ సినిమా విడుదల అవుతుంది అనగానే ప్రతీ యాక్టర్‌కు ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలా చేస్తే తమ సినిమా హిట్ అవుతుంది అని నమ్మకం ఉంటుంది. అలాగే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు కూడా ఉంది. ఇప్పటికే 2023లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. రెండిటితోనూ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు షారుఖ్. ఇప్పుడు ఈ ఏడాదిలోనే తన మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. ఇదే సందర్భంగా తన ఇష్టదైవాన్ని సందర్శించుకోవడానికి వెళ్లాడు ఈ సీనియర్ హీరో. తన ప్రతీ సినిమా రిలీజ్‌కు ముందు ఇలా చేయడం షారుఖ్‌కు అలవాటని తెలుస్తోంది.

జమ్మూకి షారుఖ్..
షారుఖ్ ఖాన్.. ఇటీవల వైష్ణో దేవీ ఆలయాన్ని సందర్శించుకున్నాడు. షారుఖ్ ఈ ఆలయానికి వెళ్లడం.. ఈ ఏడాదిలో ఇది మూడోసారి. చూస్తుంటే తన ప్రతీ సినిమా విడుదలకు ముందు ఆ ఆలయానికి వెళ్లడం అలవాటుగా మార్చుకున్నట్టున్నాడు బాలీవుడ్ బాద్‌షా. అంతే కాకుండా అలా చేసిన ప్రతీసారి తన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్నాయి కూడా. తాజాగా జమ్మూలోని వైష్ణో దేవీ ఆలయాన్ని షారుఖ్ సందర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన బాడీగార్డ్స్, మ్యానేజర్స్‌తో కలిసి ఈ గుడికి వెళ్లాడు షారుఖ్. తన మ్యానేజర్ పూజా దడ్లానీ కూడా తనతోనే ఉంది. బ్లాక్ జాకెట్‌లో హుడీ వేసుకొని స్టైలిష్‌గా కనిపించాడు ఈ హీరో.

‘సలార్’కు పోటీగా ‘డంకీ’..
ఇక షారుఖ్ ఖాన్ ఆలయ సందర్శన.. తన తరువాతి సినిమా ‘డంకీ’ కోసమే అని ప్రేక్షకులకు అర్థమయ్యింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్, తాప్సీ లీడ్ రోల్స్ చేసిన ‘డంకీ’.. డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తన కథ మీద ఉన్న నమ్మకంతో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్’లాంటి యాక్షన్ సినిమాతో తలపడడానికి వెనకాడడం లేదు షారుఖ్. ఒకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ కూడా డిసెంబర్ 21న విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘డంకీ’ను కూడా ‘సలార్’కు ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్‌లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా..
ఇప్పటికే ‘డంకీ’ సినిమాకు సంబంధించిన ట్రైలర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. షారుఖ్ మునుపటి సినిమాలా ఇదొక పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా కాదు. ఇందులో రాజ్‌కుమార్ హిరానీ స్టైల్‌లో ఒక మెసేజ కూడా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇది ఫారిన్ వెళ్లాలనుకొని కలలు కనే నలుగురు స్నేహితుల కథ. ఇది పలు నిజ జీవిత సంఘటనలపై ఆధారపడి తెరకెక్కిన చిత్రమని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. బోమన్ ఇరానీ, విక్రమ్ కోచర్, అనిల్ గ్రోవర్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ ప్రజెంటేషన్ కలిసి ‘డంకీ’ని సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఇందులో షారుఖ్ ఖాన్ కూడా యాక్టివ్‌గా పాల్గొనాలనే ఆలోచనలో ఉన్నారట.

Also Read: ‘సలార్’ మూవీలో ‘కేజీఎఫ్‘ హీరో యష్? అసలు సంగతి ఇదీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget