అన్వేషించండి

Salaar Movie: ‘సలార్’ మూవీలో ‘కేజీఎఫ్‘ హీరో యష్? అసలు సంగతి ఇదీ!

Salaar Movie: ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’లో ‘కేజీఎఫ్’ స్టార్ యష్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అసలు సంగతి బయటకు వచ్చింది.

Singer Theertha About Salaar Movie: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’ రిలీజ్ డేట్ దగ్గర పడింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో అలరించనుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న అభిమానుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులో ఓ రేంజిలో ఆకట్టుకుంది. 'సలార్' పార్ట్-1 సీజ్ ఫైర్ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమానులలో మరింత ఆసక్తి నెలకొంది.  ‘ఆదిపురుష్’ పరాభవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

‘సలార్’ సినిమాలో యష్ నటిస్తున్నారంటూ వార్తలు

‘సలార్’ చిత్రంలో ‘కేజీఎఫ్’ హీరో యష్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైల్ట్ సింగర్ తీర్థ సుభాష్ ఈ విషయాన్ని వెల్లడించింది. యష్ ఈ మూవీలో అతిథి పాత్ర చేస్తున్నట్లు వివరించింది. “యష్ అంకుల్', 'ప్రభాస్ అంకుల్', 'పృథ్వీరాజ్ అంకుల్' ఈ సినిమాలో నటిస్తున్నారు” అని చెప్పింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, యష్ అభిమానులు ఈ న్యూస్ విని ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సినిమా మరో రేంజిలో ఉంటుందని అందరూ భావించారు. వాస్తవానికి ‘సలార్’ స్టోరీ గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’లో భాగంగానే ఈ సినిమా వస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ‘సలార్’ టీజర్, ట్రైలర్ లో సైతం ‘కేజీఎఫ్’ పోలికలు కనిపించాయి. ఈ నేపథ్యంలో ‘సలార్’ మూవీ ‘కేజీఎఫ్’కు కొనసాగింపు కావచ్చని భావించారు. ఈ నేపథ్యంలోనే తీర్థ సుభాష్ ఈ మూవీలో యష్ నటిస్తున్నారని చెప్పడంతో అందరూ నిజమే అనుకున్నారు.

కీలక విషయాలు వెల్లడించిన సింగర్ తీర్థ సుభాష్

తాజాగా తీర్థ సుభాష్ కామెంట్స్ కు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో యష్ నటిస్తున్నారని పొరపాటుగా చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ మేరకు కన్నడ చైల్డ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. "నేను KGF చిత్రాన్ని చాలాసార్లు చూశాను. మా నాన్నగారు ‘సలార్’ మూవీ మ్యూజిక్ తో పాటు పలు అంశాల గురించి చెప్పారు. ఆ విషయాలను గుర్తు చేసుకుని యష్ అంకుల్ కూడా ‘సలార్‌’లో ఉంటారని భావించాను. అదే విషయాన్ని బయటకు చెప్పాను. నేను పొరపాటుగా ఈ విషయాన్ని వెల్లడించాను. దయచేసి నన్ను ట్రోల్ చేయకండి” అని చెప్పుకొచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Theertha Subhash official 🔵 (@_theerthasubhash)

'సలార్' మూవీ గురించి..

ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. 'సలార్: పార్ట్ 1’ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రభాస్ ‘సలార్’గా పృథ్వీరాజ్ వరద రాజమన్నార్ గా కనిపించనున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా, టిన్ను ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  

Read Also: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Youtube Income: యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
Embed widget