By: ABP Desam | Updated at : 24 May 2023 04:23 PM (IST)
Image Credit: Shah Rukh Khan/Instagram
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం హిందీలోనే కాదు, అన్ని భాషల్లోనూ ఆయనకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అతనిపై అభిమానాన్ని చూపిస్తుంటారు. షారూక్ సైతం తన అభిమానుల పట్ల ప్రేమను కలిగివుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాన్స్ అందించే ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పలు సందర్భాల్లో తెలిపారు. అయితే ఇప్పుడు లేటెస్టుగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన అభిమానికి భరోసా కల్పించి, అందరి మనసులను చూరగొన్నాడు షారుక్.
కోల్ కతాకు చెందిన 60 ఏళ్ల శివాని, షారుక్ ఖాన్ కు వీరాభిమాని. అయితే గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె, తన అభిమాన హీరోని కలవడమే చివరి కోరికగా పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న షారుక్, తనను కలవాలన్న ఆమె చివరి కోరికను నెరవేర్చాడు. ఆమెకు వ్యక్తిగతంగా కాల్ చేయడానికి సమయాన్ని వెచ్చించడమే కాదు, దాదాపు 30 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Hi, I’m Priya from Kolkata, My Mummy is Last Stage Cancer Patient, I'm Requesting Everyone Please Help my Mummy to Meet @iamsrk Sir, I Don't Know How Much Time She Have, Please help her to Fulfill her Last Wish. 🙏@RedChilliesEnt @pooja_dadlani @KarunaBadwal @MeerFoundation pic.twitter.com/h3TuCwDOlw
— Priya Chakraborty, প্রিয়া চক্রবর্তী (@SRKsRouter1) May 14, 2023
శివాని కుమార్తె ప్రియా చక్రవర్తి తన తల్లి కోరికను పంచుకుంటూ ట్విట్టర్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో తన కుమార్తె షారుక్ ఖాన్ నివాసమైన మన్నత్ కు తీసుకెళ్తానని హామీ ఇచ్చిందని, ఆమె పరిస్థితి కారణంగా ఆయన ఇంటికి వెళ్లలేనని శివాని ఆ వీడియోలో పేర్కొంది. అక్టోబర్ 2022లో తనకు స్టేజ్-4 క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పింది. షారుక్ ని కలవడమే తన చివరి కోరిక అని, తన కోరిక తీర్చమని అభ్యర్థించడంతో.. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది.
శివాని - ప్రియా చక్రవర్తిల వీడియో షారుక్ ఖాన్ వరకూ చేరడంతో, స్వయంగా వారికి ఫోన్ చేసి మాట్లాడారు. వారితో మాట్లాడే సమయంలో షారుఖ్ ఖాన్ తన డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఎంతో మర్యాద, దయ చూపించారని ఓ నెటిజన్ ట్వీట్ చేసాడు. అతను శివానీకి మూడుసార్లు బై చెప్పినా, కాల్ కట్ చేయకుండా మాట్లాడారని తెలిపాడు.
క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న శివానీని ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చిన షారుక్.. కోల్ కతాకు వచ్చినప్పుడు ఆమెను కలవడానికి తన సుముఖతను వ్యక్తం చేశారు. అంతేకాదు తాను వచ్చినప్పుడు తన కోసం చేపల కూర వండమని కోరాడు. అనారోగ్యంతో చివరి దశలో ఉన్న శివాని జీవితంలో ఆనందాన్ని, ఆశను తీసుకురావడానికి ప్రయత్నించారు షారుఖ్. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తె ప్రియా వివాహానికి హాజరు కావాల్సిందిగా తన ఫేవరేట్ హీరోని కోరినట్లు తెలుస్తోంది.
Remember Shivani that 60yrs Old Last Stage Cancer Patient from Kolkata Her Last Wish Was to Meet @iamsrk Sir?
— SRKian Faizy ( FAN ) (@SrkianFaizy9955) May 23, 2023
Her Wish Got Fulfilled Last Night, Today SRK Sir Called her Talked almost 30 Minutes, He is The Humblest Star on Earth for a Reason,
1/4 pic.twitter.com/gWSSgQpzv4
షారూఖ్ ఖాన్ అంత బిజీ షెడ్యూల్ లో కూడా తన అభిమాని ముఖంలో చిరునవ్వు తీసుకొచ్చాడని.. ఇలాంటి విషయాలే ఆయన్ను బాలీవుడ్ కింగ్ ఖాన్ గా ఎందుకు ప్రశంసింస్తారనేది తెలియజేస్తామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే, 'పఠాన్' తో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు షారుక్ ఖాన్. చాలా ఏళ్లుగా సరైన హిట్ కోసం వేచి చూస్తున్న అగ్ర హీరో.. 1000 కోట్ల చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇదే జోష్ లో త్వరలో 'జవాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీని తర్వాత 'డుంకి' సినిమా చేయనున్న షారుక్.. సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్ 2' మూవీలో క్యామియో అప్పీరియన్స్ ఇవ్వనున్నారు.
Read Also: పవన్ - సాయి తేజ్ - ఇంతకీ ఇద్దరిలో దేవుడెవరు 'బ్రో'?
NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్
Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!
2018 Movie OTT Release : నెల రోజుల్లోనే ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ '2018' - ఎప్పుడు? ఎక్కడ? అంటే...
Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !
Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?