Shah Rukh Khan: అలాంటి క్యారెక్టర్ అయితే ఆలోచిస్తా - హాలీవుడ్ ఎంట్రీపై షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
Shah Rukh Khan About Hollywood Entry: హాలీవుడ్ లో సినిమాలు చేయడం గురించి షారుఖ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన స్టార్ డమ్ కు సరిపోయే క్యారెక్టర్ లభిస్తే ఆలోచిస్తానని వెల్లడించారు.
Shah Rukh Khan About Hollywood Entry: భారతీయ సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొసాగుతున్న షారుఖ్ ఖాన్.. చాలా కాలంగా హాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఆయన ఇప్పట్లో ఇంగ్లీష్ సినిమాల జోలికి వెళ్లే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఇండియన్ సినీ అభిమానులు తనకు ఎంతో గొప్ప గౌరవాన్ని ఇచ్చారని, ఆ హోదాకు తగిని క్యారెక్టర్ లభిస్తేనే హాలీవుడ్ సినిమాలు చేసే విషయం గురించి ఆలోచిస్తానన్నారు. “హాలీవుడ్ అనేది ప్రపంచలోనే అతిపెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ.
నేను అక్కడ సినిమాలు చేయాలంటే నాకంటూ కొన్ని పరిమితులు పెట్టుకున్నాను. ప్రస్తుతం తనకు గొప్పగా ఇంగ్లీష్ రాదు. చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలను అని భావించినప్పుడు హాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తాను. ఇండియన్ సినీ అభిమానులు నాకు గొప్ప గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవానికి ఇబ్బంది కలగకుండా ఉండే క్యారెక్టర్ లభించినప్పుడు చేస్తాను. నేను చేసే పాత్రలు నా అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. ఇండియన్ ఆడియెన్స్ నన్ను చాలా గౌరవిస్తున్నారు. ఏ భాషలో సినిమాలు చేసినా ఆ గౌరవానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అందుకే, హాలీవుడ్ లో సినిమాలు చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాను” అని షారుఖ్ వెల్లడించారు.
సౌత్ సినిమాలపై షారుఖ్ ప్రశంసలు
రీసెంట్ గా సౌత్ సినిమాలపై షారుఖ్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. గత కొంతకాలంగా సౌత్ సినిమాల్లో టెక్నికల్, సినిమాటిక్ అంశాలు అద్భుతంగా ఉంటున్నాయని వెల్లడించారు. తనకు మరోసారి నేరుగా సౌత్ సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెట్టుకున్నారు. స్విట్జర్లాండ్ లో జరిగిన లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న షారుఖ్ ఖాన్ సౌత్ సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినిమాలను ప్రాంతాలుగా విడదీయడం సరికాదన్న ఆయన.. తెలుగు, మలయాళం, తమిళ సినిమా పరిశ్రమలలో అతిపెద్ద సూపర్ స్టార్లు ఉన్నారని చెప్పారు. సినిమా పరంగా, టెక్నికల్ గా కూడా సౌత్ ఇండియన్ సినిమాలు చాలా బాగుంటాయని కితాబిచ్చారు. మణిరత్నంతో ‘దిల్ సే’ చిత్రం చేసిన తర్వాత, ఇప్పుడు మరోసారి సౌత్ సినిమా చేయాలి అనిపిస్తోందని చెప్పుకొచ్చారు.
‘కింగ్’ సినిమా బిజీలో షారుఖ్
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘కింగ్’ మూవీలో చేస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు షారుఖ్ వెల్లడించారు. సరికొత్తగా, ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సుజోయ్ ఘోష్ అయితేనే ఇలాంటి కథను బాగా తెరకెక్కించగలరన్నారు. భావోద్వేగాలతో కూడిన కథను ఆయన అద్భుతంగా హ్యాండిల్ చేస్తారని చెప్పారు. మాస్ అంశాలతో పాటు.. సెంటిమెంట్ కు కూడా ఈ చిత్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
Read Also: ముగ్గురు ఖాన్‌లతో ఒక సినిమా తీయాలని ఉంది - బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Read Also: ఇదేం ఇండిపెండెన్స్ డే, కోల్‌కత్తా డాక్టర్ హత్యాచార ఘటనపై ఉపాసనా సెన్సేషనల్ పోస్ట్