అన్వేషించండి

Kangana Ranaut: ముగ్గురు ఖాన్‌లతో ఒక సినిమా తీయాలని ఉంది - బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kangana Ranaut: కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ‘ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ముగ్గురు ఖాన్‌లతో సినిమా తెరకెక్కించాలని ఉందని చెప్పారు.

Kangana Ranaut About Bollywood Khan’s: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ‘. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా, ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరోలైన ముగ్గురు ఖాన్ లు (అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్)తో ఓ సినిమా తెరకెక్కించాలని ఉందని పేర్కొన్నారు. "ముగ్గురు ఖాన్ లతో ఒకేసారి సినిమా నిర్మించాలి అనుకుంటున్నాను. ఆ సినిమాకు నేనే దర్శకత్వం వహించాలి అనుకుంటున్నాను. ముగ్గురితో చేయడం వల్ల నా సినిమాకు గ్లామర్ బాగా పెరుగుతుంది.  ఈ చిత్రంతో మంచి సోషల్ మేసేజ్ కూడా అందిస్తాను. అంతేకాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గ్రేట్ మూవీగా నిలిచిపోతుంది" అంటూ కంగనా చెప్పుకొచ్చారు.     

ఆకట్టుకుంటున్న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్

అటు ‘ఎమర్జెన్సీ’ మూవీ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు, ఇందిరా నిరంకుశంగా వ్యవహరించిన తీరును కంగనా చూపించబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత ఇందిర రాజకీయాల్లోకి అడుగు పెట్టడం, ప్రధాని పీఠాన్ని దక్కించుకోవడం, భారత్ పాకిస్థాన్ యుద్ధం, సిమ్లా ఒప్పందం, ప్రతిపక్ష నేతలతో ఆమె వ్యవహరించిన తీరు,  దేశంలో  ఎమర్జెన్సీ విధించడాన్ని ఇందులో ప్రస్తావించారు. “ఈ దేశం నుంచి తనకు ద్వేషం తప్ప మిగిలింది ఏమీ లేదు. ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర” అనే పవర్ ఫుల్ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఇందిర జీవితం షేక్ స్పియరియన్ విషాదం అనే నానుడిని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

పలుమార్లు వాయిదా పడ్డ ‘ఎమర్జెన్సీ’ విడుదల

‘ఎమర్జెన్సీ’ సినిమా గ‌త ఏడాది నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, పోస్టు ప్రొడక్షన్ పనులలో జాప్యం కారణంగా జూన్ 14కు వాయిదా పడింది. ఆ తర్వాత కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.  హిమాచల్ ప్రదేశం లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా విజయం సాధించారు.  ఈ నేపథ్యంలో సినిమా మరోసారి వాయిదా పడింది. ఇక ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పడే కీలక పాత్రలు పోషించారు. వాజ్‌పేయి పాత్రలో శ్రేయాస్ తల్పడే కనిపించగా.  జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌, మణికర్ణిక ఫిలిమ్స్‌ బ్యానర్లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  

Read Also: ఇదేం ఇండిపెండెన్స్ డే, కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఉపాసనా సెన్సేషనల్ పోస్ట్

Read Also: పాలిటిక్స్ తోనే సరిపోతుంది, వాటికి అస్సలు టైమ్ దొరకట్లేదన్న కంగనా రౌనత్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget