అన్వేషించండి

Renu Desai : అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం

Renu Desai : పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో చేసిన ఓ సుదీర్ఘ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Renu Desai : పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో విడాకుల అనంతరం కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైన రేణు దేశాయ్ ఇటీవల కాలంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలెట్టింది. ఇప్పటికే బుల్లితెరపై పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించిన ఈమె రీసెంట్ గా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ టైటిల్ రోల్ పోషించగా, రేణు దేశాయ్ హేమలత లవణం అనే ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఈ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో సమాజంలో మహిళలలను చిన్న చూపు చూస్తారని, వాళ్లు కూడా మగాళ్ళతో సమానమేనని, వాళ్లకంటూ ఎన్నో కలలో ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై ఓ సీనియర్ జర్నలిస్ట్ రేణు దేశాయ్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేణు దేశాయ్ ఈ మధ్య ఎక్కువగా రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మడి రామారావు పలు యూట్యూబ్ చానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలకి సంబంధించిన కొన్ని క్లిప్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు దేశాయ్ పలు సుదీర్ఘ పోస్టులు పెట్టింది.

ఒక ఇంటర్వ్యూలో కేవలం 7 నిమిషాల్లోనే 13 సార్లు తన పేరు తీశాడంటూ ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సదరు సీనియర్ జర్నలిస్టుకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఈ మేరకు తాను సింగిల్ ఉమెన్ గా సాధించిన ఘనతలను ఓ పోస్ట్ ద్వారా పేర్కొంది. "సుమారు 30 యాడ్స్ లో నటించాను. తెలుగు, తమిళంలో మూడు సినిమాలు చేశాను. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ నేనే. స్కూల్, కాలేజీలో మెరిట్ స్టూడెంట్ ని. టీవీ షోలో సక్సెస్ఫుల్ జడ్జి. సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉమెన్. డైరెక్టర్, ప్రొడ్యూసర్... ఇలాంటి ఘనతలు సాధించిన నా గురించి నాకు తెలియని ఓ వ్యక్తి నా జీవితంలో నేను ఏం చేయాలనేది చెబుతున్నాడు" అంటూ అతనిపై ఫైర్ అయింది రేణు దేశాయ్.

"అంకుల్ మీరు నా నామస్మరణం చేసి సంపాదిస్తున్నారు. నా పేరు వల్ల మీకు కొంత డబ్బులు వస్తున్నాయంటే అందుకు నేను సంతోషిస్తాను. నీ ఓన్ టాలెంట్, ఎక్స్పీరియన్స్ తో నువ్వు డబ్బులు సంపాదిస్తే అది చాలా బాగుంటుంది. కానీ సింపుల్ గా చైర్ లో కూర్చుని ఫిలిం యాక్టర్స్ గురించి గాసిప్స్ చెబుతూ డబ్బులు సంపాదిస్తున్నావ్. అంకుల్, మీ ఈ సమయాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించండి. లేకుంటే ఆ దేవుడి నామస్మరణ చేయండి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మీ అనుభవం ఇలా ఉందంటే జాలి వేస్తుంది. అంకుల్, నేనెప్పుడూ మిమ్మల్ని కలవలేదు. నా గురించి మీకేం తెలీదు. కానీ నా గురించి ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు దుర్గాదేవి, కాళీమాత వంటి శక్తివంతులని భావించే మన కల్చర్ లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్లు వేస్ట్ అంటూ మీలాంటి వాళ్ళు ఈ సొసైటీకి నేర్పిస్తున్నారు" అంటూ మరో పోస్టులో రాసుకొచ్చింది రేణు దేశాయ్.

Also Read : ఆ సినిమాల తర్వాతే 'యానిమల్' సీక్వెల్ - సందీప్ రెడ్డి వంగా, వామ్మో అన్నేళ్లు ఆగాలా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget