అన్వేషించండి

Priyamani : నేను నా భర్తను భయపెడతాను, మన మాట వినాల్సిందే: ప్రియమణి

Priyamani : 'భామాకలాపం 2' ప్రమోషన్స్ లో భాగంగా తాజా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రియమణి రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.

Senior Actress Priyamani Speech At Bhamakalapam2 Press Meet : సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామా కలాపం' అనే వెబ్ మూవీ ఆహా ఓటీటీలో ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. 2022 లో వచ్చిన ఈ క్రైం థ్రిల్లర్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా 'భామాకలాపం 2'ను తీసుకువస్తున్నారు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా 'భామాకలాపం 2' ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వెబ్‌ మూవీ ట్రైలర్‌ను ‘ఆహా’ విడుదల చేసింది. ఆహా ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ‘భామాకలాపం 2’ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.

నా గ్లామర్ సీక్రెట్ అదే

2003 నుంచి 2024 వరకు మీ గ్లామర్ ని అలాగే మైంటైన్ చేస్తున్నారు, దాని వెనుక సీక్రెట్ ఏంటి? అని రిపోర్టర్ అడగ్గా, అందుకు ప్రియమణి బదులిస్తూ.. "హ్యాపీ పీపుల్ తో ఎక్కువగా కలవడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం, పాజిటివ్ వైబ్స్.. ఇవే నా గ్లామర్ సీక్రెట్" అని చెప్పింది. 

నిజ జీవితంలో ప్రియమణి భర్తకి భయపడతారా? భయపెడతారా?

"నేను భర్తకు భయపడతాను, అదే సమయంలో భయపెడతాను. అంటే వయొలెన్స్ అని కాదు. కొన్ని సందర్భాల్లో భర్త మన మాట వినాలి, మనం కొన్నిసార్లు వాళ్ళ మాట వినాలి. ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట. అయినా భార్య భర్త అన్నాక గొడవలు సాధారణం" అని ప్రియమణి చెప్పుకొచ్చింది.

ఇప్పటికీ అన్నీ భాషల్లో ఆఫర్స్ రావడం ఎంతో హ్యాపీగా ఉంది

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ నాకు ఆఫర్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగులో మాత్రమే కాకుండా అన్ని లాంగ్వేజెస్ లో చాలామంది ఆఫర్స్ ఇస్తున్నారు. చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఓటీపీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికీ నాకు వరుస ఆఫర్స్ వస్తుండడం అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్లు కూడా నా మీద నమ్మకం పెట్టి కాల్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఫిలిం మేకర్స్ వ్యూ పాయింట్ కూడా చేంజ్ అయింది. ఒకప్పుడు పెళ్లయిన తర్వాత హీరోయిన్లు ఫిలిం కెరీర్ కన్నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి అయినా అవ్వకపోయినా ఇండస్ట్రీ, ఆడియన్స్ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. పెళ్లయిన తర్వాత హీరోయిన్ గా కొనసాగాలా లేక బ్రేక్ తీసుకోవాలా అనేది ఆమె మీదే ఆధారపడి ఉంటుంది. కానీ పెళ్లయిన హీరోయిన్స్ ఇప్పుడు చూస్తే చాలా మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. అది ఎప్పటికీ అలాగే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నా" అంటూ చెప్పింది.

‘భామాకలాపం 2’లో సీరత్ కపూర్, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ‘ఆహా’ ఓటీటీ సంస్థతో కలిసి డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్‌ ఈదార్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ సిరీస్ ని అభిమన్యు డైరెక్ట్ చేశారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. 

Also Read : రవితేజపై ప్రియమణి కామెంట్స్ - మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Embed widget