అన్వేషించండి

Sarfira Trailer: హిందీలో ‘సర్ఫిరా’గా వస్తోన్న ‘ఆకాశమే నీ హద్దురా’.. ట్రైలర్ వచ్చేసింది చూశారా?

తమిళ స్టార్ హీరో సూర్య నటించి ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా 'సర్ఫిరా' పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

Sarfira Movie Trailer: అక్షయ్ కుమార్ తెరకెక్కిన తాజాగా చిత్రం ‘సర్ఫిరా’. తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే కథాశంతో సుధా కొంగర ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే ఈ మూవీ  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తక్కువ ధరతో సామాన్యులు కూడా విమానం ఎక్కాలనే లక్ష్యం కోసం కొట్లాడే వ్యక్తిగా అక్షయ్ అద్భుత నటన కనబర్చారు. ‘సర్ఫిరా’ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.

నా జీవితంలో మర్చిపోలేని సినిమా- అక్షయ్ కుమార్

తమిళ స్టార్ హీరో సూర్య, సుధా కొంగర కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’కు రీమేక్ గా ‘సర్ఫిరా’ చిత్రం తెరకెక్కుతోంది. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంలోని సూర్య పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నారు. ‘సర్ఫిరా’ ట్రైలర్‌  అభిమానుల అంచనాలకు తగినట్లుగానే ఉంది. ఈ సినిమాలో సూర్య కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన కనిపించేది కొద్దిసేపే అయినా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా అక్షయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పెద్ద పెద్ద కలలు కనడం అనేది నిజంగా సాహసం లాంటిది. అలాంటి ఓ గొప్ప సాహసాన్ని చేసిన ఓ వ్యక్తి కథే ఈ సినిమా. ఈ మూవీ, ఈ మూవీ కథ, ఇందులో నా పాత్ర జీవితంలో మర్చిపోలేను” అని చెప్పుకొచ్చారు.

నేరుగా ఓటీటీలో విడుదలైన 'ఆకాశమే నీ హద్దురా'

 సూర్య నిర్మాతగా 2020లో 'ఆకాశమే నీ హద్దురా' సినిమా రూపొందింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది. అమెజాన్‌ ‍ప్రైమ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి ఆదరణ దక్కించుకుంది. ఎయిర్‌ దక్కన్‌ విమానయాన సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలని ప్రయత్నించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిది.

జులై 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల

‘సర్ఫిరా’ సినిమాకు కూడా జ్యోతిక, సూర్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సుధార కొంగర ఈ సినిమాను తెరకెక్కించారు.  రాధిక మదన్, పరేష్ రావల్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. జులై 12 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఖాతాలో మరో హిట్ పడటం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget