Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... 'రాజా సాబ్' బండి ముందుకు కదిలిందండోయ్
Raja Saab Update: రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూసే అభిమానులకు ఒక గుడ్ న్యూస్. మారుతి దర్శకత్వంలోని 'రాజా సాబ్' బండి కదిలింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ఒక్కటి కాదు... నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయితే ఏ సినిమా ముందు విడుదల అవుతుంది? ఏది వెనక్కి వెళుతుంది? అనే క్లారిటీ మిస్ అవుతోంది. అందుకే ఆయన సినిమాల అప్డేట్స్ కోసం ఫాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్లకు ఒక గుడ్ న్యూస్. 'రాజా సాబ్' బండి ముందుకు కదిలింది.
హైదరాబాద్ వచ్చిన సంజయ్ దత్...
'రాజా సాబ్' షూటింగ్‌లో అడుగు పెట్టారోయ్!
ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలలో 'ది రాజా సాబ్' (The Raja Saab Movie) ఒకటి. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ అండ్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న వినోదాత్మక చిత్రమిది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 'ది రాజా సాబ్' షూటింగ్ కోసం బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ హైదరాబాద్ వచ్చారు. ఆయన చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సంజయ్ సహా కీలక తారాగణం మీద దర్శకుడు మారుతి ప్రధాన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు హైదరాబాద్ నగర శివారులలోని అజీజ్ నగర్‌లో ఒక స్టూడియో ఉంది. అందులో లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతోంది.
ఇటలీ నుంచి ప్రభాస్ వచ్చిన తర్వాత...
'ది రాజా సాబ్' షూటింగ్ అయితే మొదలు అయ్యింది కానీ... అందులో హీరో ప్రభాస్ జాయిన్ కాలేదు. ప్రస్తుతం ఆయన ఇటలీలో ఉన్నారు. వరుస సినిమా షూటింగ్స్ నుంచి కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటలీ నుంచి ప్రభాస్ ఇండియా వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. త్వరలో ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేయడానికి దర్శకుడు మారుతి సన్నాహాలు చేస్తున్నారట.
Also Read: ఇండియన్ 2 ఫ్లాపైనా కమల్ క్రేజ్ తగ్గలే... నాన్ థియేట్రికల్ రైట్స్‌తో నిర్మాతల జేబులో 200 కోట్లు
'ది రాజా సాబ్' కాకుండా ప్రభాస్ చేతిలో మరొక నాలుగు సినిమాలు ఉన్నాయి. 'సీతా రామం' వంటి విజయవంతమైన సినిమా తీసిన హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యిందని చెప్పాలి. అది కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ' సినిమా సీక్వెల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా 'డ్రాగన్' సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్, అది పూర్తి అయ్యాక ప్రభాస్ హీరోగా 'సలార్' సీక్వెల్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చేయనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కోసం ఇంకొంత మంది దర్శకులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఆయన ఓకే అంటే పాన్ ఇండియా స్థాయిలో వెయ్యి కోట్లతో సినిమాలు చేయడానికి నిర్మాతలు చాలా మంది రెడీగా ఉన్నారు.
Also Read: 'జైలర్ 2' తర్వాత మరో తమిళ దర్శకుడికి బాలకృష్ణ ఛాన్స్... వింటేజ్ వైబ్స్ ఇచ్చేలా యాక్షన్ ఎంటర్‌టైనర్?





















