Thug Life: ఇండియన్ 2 ఫ్లాపైనా కమల్ క్రేజ్ తగ్గలే... నాన్ థియేట్రికల్ రైట్స్‌తో నిర్మాతల జేబులో 200 కోట్లు
Thug Life OTT Rights Price: కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వం వహించిన 'థగ్ లైఫ్' సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీ మొత్తాన్ని నిర్మాతల జేబులోకి వచ్చేలా చేసింది.

లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'థగ్ లైఫ్' (Thug Life). ఇందులో కోలీవుడ్ యంగ్ స్టార్ శింబు మరో హీరో. సౌత్ క్వీన్ త్రిష ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. జూన్ 5న థియేటర్లలోకి ఈ మూవీ రానుంది. బాక్సాఫీస్ కలెక్షన్స్ కంటే ముందు నిర్మాతల జేబులో 200 కోట్ల రూపాయలు వచ్చాయి. ఎలా అంటే?
నాన్ థియేట్రికల్ రైట్స్ 200 ప్లస్ కోట్లు
Thug Life Non Theatrical Rights: నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 'థగ్ లైఫ్'కు 210 కోట్ల రూపాయలు వచ్చాయని కోలీవుడ్ టాక్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తీసుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఆల్మోస్ట్ రూ. 150 కోట్లు చెల్లించింది. ఇక తమిళ టీవీ శాటిలైట్ రైట్స్ విజయ్ టీవీ తీసుకుందని తెలిసింది. అందుకోసం రూ. 60 కోట్ల డీల్ సెట్ అయ్యిందట. ఆడియో రైట్స్ రూపంలో ఎలా లేదన్నా పది కోట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కమల్ హాసన్ లాస్ట్ సినిమా 'ఇండియన్ 2' థియేటర్లలో డిజాస్టర్ రిజల్ట్ చూసింది. అయినా సరే కమల్ క్రేజ్ తగ్గలేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
'థగ్ లైఫ్' సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీత దర్శకుడు. మణిరత్నం దర్శకత్వం వహించే ప్రతి సినిమాకూ దాదాపుగా సంగీతం అందించేది ఆయనే. రెహమాన్ - మణిరత్నం కలయికలో ప్రతి సినిమా మ్యూజికల్ చార్ట్ బస్టర్. అందుకని, 'థగ్ లైఫ్' సినిమా ఆడియో రైట్స్‌కు మంచి ఆఫర్ వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: యూజర్లకు షాక్ ఇచ్చిన ప్రైమ్ వీడియో... యాడ్స్ చూడక తప్పదు - వద్దంటే ఎక్స్ట్రా కట్టాలమ్మా
'థగ్ లైఫ్'ను రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంస్థలపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ ఆనంద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ జైయింట్ మూవీస్ ప్రెజెంట్ చేస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ (నితిన్ తండ్రి ఎన్ సుధాకర్ రెడ్డి) తెలుగులో సినిమాను విడుదల చేస్తోంది.
Also Read: హరికృష్ణ మనవడి సినిమా.... అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎందుకు ట్వీట్ చేయలే?
Thug Life Cast And Crew: కమల్ హాసన్, శింబు, త్రిష కృష్ణన్, అలీ ఫజల్, అశోక్ సెల్వన్, పంకజ్ త్రిపాఠి, జోజు జార్జ్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, సాన్యా మల్హోత్రా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, యాక్షన్: అన్బరివ్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: శర్మిష్ట రాయ్, రచన - దర్శకత్వం: మణిరత్నం.
View this post on Instagram





















