Amazon Prime Video: యూజర్లకు షాక్ ఇచ్చిన ప్రైమ్ వీడియో... యాడ్స్ చూడక తప్పదు - వద్దంటే ఎక్స్ట్రా కట్టాలమ్మా
Amazon Prime Video New Plan: ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి యాడ్స్ ప్లే అవుతాయని చెప్పింది. ఒకవేళ యాడ్స్ వద్దని అనుకుంటే ఎక్స్ట్రా పే చేయాలని పేర్కొంది.

సబ్‌స్క్రైబర్లకు, యూజర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ షాక్ ఇచ్చింది. ఏడాది లేదా నెలకు సబ్‌స్క్రిప్షన్ ఫీజ్ మార్చలేదు. కానీ, ఒక ట్విస్ట్ ఇచ్చింది. ప్రజెంట్ ఉన్న సబ్‌స్క్రిప్షన్‌తో యాడ్ ఫ్రీ కంటెంట్ చూడటం కుదరదని పేర్కొంది. ఇక నుంచి యాడ్స్ ప్లే చేస్తామని స్పష్టం చేసింది.
జూన్ 17వ తేదీ నుంచి కొత్త టారిఫ్
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ కొంత మంది ఏడాదికి తీసుకుంటే ఇంకొందరు ఆరు నెలలు, మూడు నెలలు లేదా నెలకు చొప్పున తీసుకుంటున్నారు. ఎవరెలా తీసుకున్నా కంటెంట్ ఒక్కటే.
Amazon Prime Video subscription cost in India: అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ కావాలంటే ఏడాదికి రూ. 1499 చెల్లించాలి. మూడు నెలలు అయితే రూ. 599, నెలకు రూ. 299 పే చేయాలి. అమెజాన్ లైట్ అయితే రూ. 799 మాత్రమే. ఒక్క డివైజ్ (ఫోన్ లేదా టీవీలో) మాత్రమే వాడాలి. ఈ ఏడాది జూన్ 17వ తేదీ నుంచి ఈ టారిఫ్‌లు మారబోతున్నాయి. ఆ రోజు నుంచి కంటెంట్ (వెబ్ సిరీస్ లేదా మూవీస్ లేదా షోస్) మధ్యలో యాడ్స్ ప్లే చేస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియో స్పష్టం చేసింది.
యాడ్స్ వద్దనుకుంటే ఎక్స్ట్రా పే చేయాలి
ఒకవేళ యాడ్స్ గనుక వద్దని అనుకుంటే... అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ మరో ప్లాన్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. నో యాడ్స్ పాలసీ కోరుకునే వీక్షకుల కోసం న్యూ యాడ్ ఫ్రీ ఆప్షన్ కోసం ఏడాదికి మరో రూ. 699 లేదా నెలకు మరో రూ. 129 కట్టాలని పేర్కొంది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో మీద యూజర్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీ సంగతి! నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ సంస్థలు కొన్ని దేశాల్లో ఈ తరహా ప్లాన్స్ అమలు చేస్తున్నాయి.
Also Read: హరికృష్ణ మనవడి సినిమా.... అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎందుకు ట్వీట్ చేయలే?
ఇండియాలో జీ 5, సోనీ లివ్, జియో హాట్ స్టార్ వంటి సంస్థలు తమ సబ్‌స్క్రైబర్లకు యాడ్ ఫ్రీ కంటెంట్ అందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకున్న కొత్త నిర్ణయం పట్ల, అలాగే యాడ్ ఫ్రీ కంటెంట్ చూడాలని కోరుకునే యూజర్లకు సబ్‌స్క్రిప్షన్ ఫీజ్ పెంచడం పట్ల మిగతా ఓటీటీలకు ప్లస్ అవుతుందేమో చూడాలి.
Also Read: తమిళ దర్శకుడితో నాగార్జున వందో సినిమా... టైటిల్ అదేనా?
Amazon Prime Update :
— TechGlare Deals (@Tech_glareOffl) May 13, 2025
Starting From 17th June 2025, Amazon Prime Video will display Ads during movies and shows.
Pay Extra Rs.699 per year if you don’t want Ads. pic.twitter.com/oWzcV5Es3D
🚨 BREAKING: Amazon Prime Video to introduce ads starting June 17, 2025.
— Way to News (@waytonews) May 13, 2025
💰 Ad-Free Plan: Extra ₹699/year or ₹129/month to remove ads.
Streaming just got a bit pricier. 😑🤔 pic.twitter.com/eDDcVMCN7n





















