Nagarjuna 100th Film: తమిళ దర్శకుడితో నాగార్జున వందో సినిమా... టైటిల్ అదేనా?
కింగ్ నాగార్జున తన వంద సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ గురించి గత కొన్ని రోజులుగా అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ వేట ఓ కొలిక్కి వచ్చిందని సమాచారం. సెంచరీ సినిమా స్క్రిప్ట్ నాగార్జున ఫైనల్ చేశారట.

మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), విక్టరీ వెంకటేష్... తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్స్. తమ నటనతో సినిమాలతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపడం మాత్రమే కాదు... తెలుగు చిత్రసీమ స్థాయిని పెంచారు. ఈ నలుగురిలో చిరంజీవి 150కు పైగా సినిమాలు చేయగా... బాలకృష్ణ 100 ప్లస్ చేశారు. నాగార్జున సెంచరీకి చేరువలో ఉన్నారు. వందో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ నాగార్జున ఫైనలైజ్ చేశారట.
కింగ్ 100... తమిళ దర్శకుడితో!
Akkineni Nagarjuna's 100th Movie: అక్కినేని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు నాగార్జునను కొన్ని సంవత్సరాల పాటు 'యువ సామ్రాట్' అని ముద్దుగా పిలిచేవారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటసామ్రాట్ అయితే కొడుకు నాగార్జున యువ సామ్రాట్ అని అలా ట్యాగ్ ఇచ్చారు.
అబ్బాయిలు నాగచైతన్య, అఖిల్ అక్కినేని హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత... యువ సామ్రాట్ ట్యాగ్ నాగ చైతన్యకు ఇచ్చారు. 'కింగ్' అని నాగార్జునకు కొత్త బిరుదు ఇచ్చారు. నాగార్జున వందో చిత్రానికి 'కింగ్ 100' (King 100 Movie) టైటిల్ ఖరారు చేస్తారని సమాచారం అందుతోంది.
Also Read: హరికృష్ణ మనవడి సినిమా.... అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎందుకు ట్వీట్ చేయలే?
వంద సినిమాల ప్రయాణంలో నాగార్జున ఎంతో మంది కొత్త దర్శకులను భారతీయ చిత్రసీమకు పరిచయం చేశారు. ఇప్పుడు తన వందో సినిమాతో తమిళ దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. రా కార్తీక్ (director Ra Karthik) దర్శకత్వంలో నాగార్జున తన వందో సినిమా చేయబోతున్నారని టాక్.
భారీ యాక్షన్... అంతకు మించి థ్రిల్!
ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీస్తున్న 'కూలీ' సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో అయితే మన టాలీవుడ్ కింగ్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాలో నాగార్జునది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ అని తెలిసింది. ఆల్రెడీ లీక్డ్ వీడియోలో లుక్, సీన్ అందరికీ నచ్చాయి. రా కార్తీక్ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అట. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు త్రిల్ ఇచ్చే విధంగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తమిళంలో అశోక్ సెల్వన్ హీరోగా రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా 'ఆకాశం' తీశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ దర్శకుడిగా నాగార్జున వందో సినిమా అంటే పెద్ద అవకాశమే. ఈ సినిమాలో భారీ సర్‌ప్రైజ్‌లు ఉండే అవకాశం ఉంది. నాగార్జునకు పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందించేలా చూస్తున్నారట. మరి, ఈ సినిమా నిర్మాతలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.





















