Sanjay Dutt: మెగాస్టార్ అంటే చాలా ఇష్టం - ప్రభాస్ బెస్ట్ యాక్టర్ అన్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్
KD Teaser Launch Event: హైదరాబాద్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అన్నారు. 'కేడీ: ది డెవిల్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

Sanjay Dutt On Chiranjeevi Prabhas In KD Movie Teaser Launch Event: కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా, రీష్మా నానయ్య ప్రధాన పాత్రలో నటించిన 'కేడీ: ది డెవిల్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ప్రేమ్ తెరకెక్కించగా... కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ భారీగా నిర్మించారు. సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి కీలక పాత్రలు పోషించారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వారు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మెగాస్టార్ అంటే ఇష్టం
మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని... రెబల్ స్టార్ ప్రభాస్ బెస్ట్ యాక్టర్ అని బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అన్నారు. 'హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. 80ల నుంచి భాగ్యనగరానికి వస్తున్నా. మరీ ముఖ్యంగా నాకు ఇక్కడి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాలో చేస్తున్నా. అక్కడే తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. నాగార్జున, చిరంజీవితో నాకు మంచి అనుబంధం ఉంది. నాగ్ కోసం 'చంద్రలేఖ' సినిమాలో నటించాను. రామ్ నాకు తమ్ముడి లాంటి వారు. ధృవ చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి.' అని అన్నారు.
ట్రెండ్ కంటిన్యూ
టాలీవుడ్‌లో 'సాహసవీరుడు సాగర కన్య' సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు తనపై ఎంతో అభిమానం చూపిస్తున్నారని హీరోయిన్ శిల్పాశెట్టి అన్నారు. 'కేడీ సినిమాలో సత్యవతి పాత్రను నాకు ఇచ్చిన డైరెక్టర్ ప్రేమ్‌కి థాంక్స్. కేవీఎన్ వెంకట్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. ధృవ, రీష్మాలతో పని చేయడం సంతోషంగా ఉంది. సంజయ్ దత్ గారితో నేను చేసిన ప్రతీ సినిమా హిట్ అయింది. అదే ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. ఈ మూవీని ప్రేమ్.. ఎంతో ప్రేమతో తెరకెక్కించారు.' అని చెప్పారు.
ఈ మూవీ టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్ చూసి తనకు మాటలు రావడం లేదని హీరో ధృవ అన్నారు. 'నాకు సంజయ్ దత్ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. శిల్పా శెట్టి వంటి యాక్టర్లతో పని చేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. మా మూవీ త్వరలోనే రాబోతోంది.' అని అన్నారు.
'కేడీ' టీజర్ అందరినీ ఆకట్టుకుంటోందని... మూవీ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని డైరెక్టర్ ప్రేమ్ తెలిపారు. 'ఈ ప్రయాణంలో నాకు హీరో ధృవ అండగా నిలిచారు. సంజయ్ దత్‌కు నేను వీరాభిమానిని. శిల్పాశెట్టికి థాంక్స్' అని అన్నారు. సంజయ్ దత్‌తో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎంతో అద్భుతమని హీరోయిన్ రీష్మా తెలిపారు. శిల్పాశెట్టి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు. కేవీఎన్ లాంటి భారీ సంస్థలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు.





















