Sandeep Reddy Vanga: నన్ను దత్తత తీసుకోండి, తెలుగు ప్రజలకు రణబీర్ రిక్వెస్ట్ - ఆయన కాళ్లు మొక్కాలనిపించిందన్న సందీప్ రెడ్డి
‘యానిమల్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ అంతా మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో హీరో రణబీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు సందీప్ వంగా.
ఒక ప్రేమకథతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. అందుకే తన తరువాతి సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని నిర్ణయించుకున్న మూవీ టీమ్.. దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయినా కూడా వీరి ఫోకస్ అంతా ఎక్కువగా తెలుగు మార్కెట్‌పైనే ఉంది. సందీప్ అప్‌కమింగ్ మూవీ ‘యానిమల్’లో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. ఈ హీరోకు తెలుగులో ఫ్యాన్స్ ఉన్నా కూడా ఇక్కడ తన సినిమాలు హిట్ చేయాలని రణబీర్ టార్గెట్‌గా పెట్టుకున్నట్టు అర్థమవుతోంది. అందుకే తెలుగు మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడానికి ఈ హీరో కష్టపడుతున్నాడు.
దత్తత తీసుకోండి ప్లీజ్..
‘యానిమల్’ మూవీ ప్రమోషన్స్ సమయంలో మూవీ టీమ్ అంతా పలుమార్లు తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఆ సమయంలో రణబీర్.. పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘నాకు హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ఇష్టమే. నేను నా మొదటి సినిమా ‘సావరియా’ ప్రమోషన్స్ కోసం ఇక్కడికి వచ్చాను. మా సినిమా ‘యానిమల్’ విడుదలకు సిద్దమవుతోంది. దీనిపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణను నేను మరెక్కడా చూడలేదు. నేను నిజంగా తెలుగు రాష్ట్రాలకు దత్తపుత్రుడు అయిపోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయండి’’ అంటూ రణబీర్.. హైదరాబాద్‌పై, తెలుగు ప్రేక్షకులపై తనకు ఉన్న అభిమానాన్ని బయటపెట్టాడు.
లవ్ టిప్స్ తీసుకుంటాను..
‘యానిమల్’ చిత్రంలో రణబీర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఆ క్యారెక్టర్ గురించి మరింత స్పష్టంగా వివరించాడు ఈ హీరో. అంతే కాకుండా ఆ పాత్ర నుంచి తాను ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నాడో కూడా బయటపెట్టాడు. ‘‘తన తండ్రిని అమితంగా ప్రేమించడానికి తనకు చిన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. తన భార్య గీతాంజలితో తను పీకల్లోతూ ప్రేమలో ఉంటాడు. నా నిజ జీవితంలో కూడా అలాంటి ప్రేమను కోరుకుంటాను. కాబట్టి తన నుంచి కొన్ని లవ్ టిప్స్ కూడా తీసుకుంటాను’’ అని తన పాత్ర గురించి చెప్పాడు రణబీర్. అంతే కాకుండా ఈ పాత్ర చాలామందికి కనెక్ట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేశాడు. సందీప్ రైటింగ్, మేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
కాళ్లు పట్టుకోవాలనిపించింది..
తెలుగులో ‘యానిమల్’ను భారీ ఎత్తున విడుదల చేస్తున్నా కూడా రణబీర్‌తో తెలుగులో ఎందుకు డబ్బింగ్ చెప్పనివ్వలేదు అని మేకర్స్‌కు పలుమార్లు ప్రశ్న ఎదురయ్యింది. దానికి సందీప్ వంగా తాజాగా క్లారిటీ ఇచ్చాడు. రణబీర్‌తో తెలుగు డబ్బింగ్ ప్రయత్నించామని బయటపెట్టాడు. కానీ తను మాట్లాడే తెలుగులో కూడా నార్త్ ఇండియన్ స్టైల్ కనిపించిందని అన్నాడు. ఈ కాస్త సమయంలో తనకు ట్రైనింగ్ ఇచ్చి, తెలుగులో మాట్లాడించడం కష్టం కాబట్టి ఆ ఆలోచనను పక్కన పెట్టేశామని చెప్పాడు సందీప్. అంతే కాకుండా ‘యానిమల్’లో రణబీర్ చేసిన పర్ఫార్మెన్స్ చూసి తన కాళ్లు పట్టుకోవాలని అనిపించిందని, తనకంటే చిన్నవాడు అయినా కూడా చాలా ఓర్పు ఉందని రణబీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు దర్శకుడు. డిసెంబర్ 8న విడుదల కానున్న ‘యానిమల్’లో రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక - అలా అనేసింది ఏమిటీ?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply