Rashmika Mandanna : డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక - అలా అనేసింది ఏమిటీ?
Rashmika Mandanna : రష్మిక మందన్న తాజాగా ఓ ప్రెస్ మీట్ లో డీప్ ఫేక్ వీడియో పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Rashmika On Deepfake Video : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ రష్మిక మందన(Rashmika Mandanna) తన డీప్ ఫేక్ వీడియో పై మీడియా వేదికగా స్పందించింది. 'యానిమల్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న రష్మిక డీప్ ఫేక్ వీడియో పై రియాక్ట్ అవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డీటెయిల్స్ లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోస్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీల ఫేస్ ని మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా ఈ మధ్య రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఎంతో వైరల్ అయి వార్తల్లో నిలిచింది. ఓ యువతి బోల్డ్ వీడియోకు రష్మిక ఫేస్ ను ఎడిట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట క్షణాల్లో వైరల్ అయింది.
ఈ డీప్ ఫేక్ వీడియోపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఇండస్ట్రీలో ఉన్న నటీనటులపై ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం రష్మిక మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, కరీనా కపూర్ లతో పాటూ పలువురి డీప్ ఫేక్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మందన మీడియా వేదికగా స్పందించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్' (Animal) మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా నటిస్తున్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో రష్మిక డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడింది. "ఇది అందరికీ జరుగుతోంది. నా విషయంలో ముందుగా అమితాబచ్చన్ సపోర్ట్ చేశారు. ఆ తర్వాత అందరూ సపోర్ట్ చేశారు. మొదట చూసినప్పుడు బాధ కలిగింది. కానీ ఇది నార్మల్ అయిపోయింది. మొదట్లో భయమేసింది. కానీ చూసి చూసి మేమేం చేయగలం అని అనుకున్నా. పట్టించుకోకూడదు అని అనుకున్నాను. కానీ అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తుంటే అది చూసి ఓకే ఇది నార్మల్ విషయం కాదు రియాక్ట్ అవ్వాలి అని అనుకున్నా. ఇప్పుడు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. దాంతో నేను అందరు అమ్మాయిలకు చెప్పాలనుకుంటున్నా. ఇలాంటివి నార్మల్ కాదు. మీకు జరిగినప్పుడు సైలెంట్ గా ఉండకండి. రియాక్ట్ అవ్వండి. జనాలు సపోర్ట్ చేస్తారు. మనం ఓ మంచి దేశంలో ఉన్నాం" అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన.
Also Read : 'ఆర్య 2'కి 14 ఏళ్లు - బన్నీ ఎమోషనల్ పోస్ట్!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply