అన్వేషించండి

Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!

Spirit Release Date : ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమే ‘స్పిరిట్’. ‘యానిమల్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ దర్శకుడు ‘స్పిరిట్’ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు.

Prabhas Spirit Release Date : పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ప్రతీ భాషలోని మూవీ లవర్స్.. వారి సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ ఔట్‌పుట్ బాగా రావాలని భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ పాన్ ఇండియా హీరోలు ఏడాదికి కేవలం ఒక సినిమాను మాత్రమే విడుదల చేయగలుగుతారు. ప్రస్తుతం ప్రభాస్ కూడా అదే చేస్తున్నారు. ఏడాదికి ఒకే సినిమా చేస్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారని కనీసం ఏడాదికి రెండు సినిమాలతో రావాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు అలా జరగలేదు. కనీసం ఈ ఏడాది నుండి అయినా రెండు సినిమాలతో ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో తన అప్‌కమింగ్ మూవీ ‘స్పిరిట్’ గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది.

అవన్నీ పూర్తయ్యాకే..

ప్రస్తుతం ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల లైనప్ చూస్తుంటే.. ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం వస్తోంది. ‘బాహుబలి’లాంటి ప్యాన్ వరల్డ్ హిట్ తర్వాత ప్రభాస్ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గానే నిలిచాయి. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’పైనే ఉన్నాయి. ప్రశాంత్ నీల్‌లాంటి కమర్షియల్ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు కాబట్టి ‘సలార్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గురించి కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయమే ఉంది. ఇక మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా డీలక్స్’పై ఎవరికీ అంతగా అంచనాలు లేకపోయినా.. ఇంకా ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు. ఇవన్నీ పూర్తి అయ్యాక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతాడు ప్రభాస్.

‘స్పిరిట్’ గురించి ఆసక్తికర విషయాలు..

సందీప్ రెడ్డి వంగా అంటే ఏంటో ఇప్పటికే టాలీవుడ్‌కు మాత్రమే కాదు.. బాలీవుడ్‌కు కూడా తెలుసు. అందుకే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తోనే తన మూడో సినిమాను ప్లాన్ చేశాడు సందీప్. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’.. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలు.. ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను ఇప్పటికే విపరీతంగా ఇంప్రెస్ చేశాయి. దీంతో సందీప్ ఖాతాలో మరో హిట్ పడుతుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. ‘యానిమల్’ సినిమా కేవలం హిందీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతుంది కాబట్టి మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. అదే సమయంలో ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు దర్శకుడు సందీప్.

‘స్పిరిట్’ రిలీజ్ అప్పుడే..

‘స్పిరిట్’ అనేది ప్రభాస్ కెరీర్‌లోనే 25వ చిత్రంగా తెరకెక్కనుంది. దీంతో ఈ మూవీని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడట సందీప్. సందీప్ తెరకెక్కించే ప్రతీ సినిమాలో వైలెన్స్ ఉంటుంది. అలాగే ‘స్పిరిట్’లో కూడా ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ‘యానిమల్’ విడుదల అవ్వగానే ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తాడట దర్శకుడు. అంతే కాకుండా 2025 క్రిస్మస్‌కు లేదా 2026 సంక్రాంతికి ‘స్పిరిట్’ థియేటర్లలో సందడి చేస్తుందని సందీప్ కచ్చితంగా చెప్తున్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ ఖుషీ ఇచ్చే న్యూస్ అవుతోంది.

Also Read: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget